Karthika Deepam 20 Aug Today Episode : కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ 20 ఆగస్టు 2021, శుక్రవారం రిలీజ్ అయింది. ఎపిసోడ్ 1123 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీపను చంపడానికి సరికొత్త గెటప్ లో మోనిత బయలుదేరుతుంది. గన్ ను తీసుకొని వెళ్తుంటుంది. కారు బుక్ చేసుకొని వెళ్తుంటుంది. ఒక దీపం ఆరిపోయింది.. అనే నాటకం వేస్తున్నాను.. అంటూ కారు డ్రైవర్ అడిగితే చెబుతుంది. రత్నసీత చెప్పినట్టు ఆ దీప గుడికి వస్తే.. దానికి ఈరోజే చివరి రోజు అయ్యేట్టు చేస్తా. దాన్ని తలిస్తే చాలు.. ఒళ్లంతా జలదరిచ్చినట్టు అవుతోంది.. అంటూ తనలో తాను అనుకుంటుంది మోనిత.
కట్ చేస్తే గుడికి భాగ్య, తన భర్త ఇద్దరూ వస్తారు. పూజారిని కలుస్తారు. ఇంతలోనే మోనిత కూడా అక్కడికి చేరుకుంటుంది. ఒక బుట్ట పట్టుకొని సోది చెప్పే మహిళగా రెడీ అయి బుట్టలో గన్ పెట్టుకొని వెళ్తుంది.
దేవుడిపైనే భారం వేశాం. ఆయనే ఇక దారి చూపించాలి. మానవ ప్రయత్నాలన్నీ చేశాం కానీ… ఏదీ కుదరలేదు. మా దీప జీవితం మంచిగుండాలి. తనకు అంతా మంచే జరగాలని పూజ జరిపించండి.. అని భాగ్య పూజారికి చెబుతుంది. నా బిడ్డ జీవితం నువ్వే కాపాడాలి అయ్యా.. అని భాగ్య భర్త దేవుడిని కోరుకుంటాడు.
మరోవైపు.. మోనిత.. దీప కోసం వెతుకుతుంది. ఎక్కడ చూసినా.. గుడిలో దీప కనిపించదు. కానీ.. భాగ్య, తన భర్త.. ఇద్దరే కనిపిస్తారు. దీప కోసం చూస్తే వీళ్లు కనిపించారేంటి. దీప రాలేదా? అని అనుకుంటుంది మోనిత.
మా దీపను కూడా ఇక్కడికి రమ్మన్నాను కానీ.. ఏదో పని ఉండి ఆగిపోయింది. దాని సమస్యకు మీరైనా పరిష్కారం చెబుతారేమో.. వెళ్లి తీసుకురానా.. పూజారి గారు.. అని అడుగుతాడు భాగ్య భర్త. నా వంతు ప్రయత్నం నేను తప్పకుంగా చేస్తాను.. అని పూజారి అంటాడు. దీప ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. రేపు తెల్లవారుజామున 5నుంచి 5.30 కు దీపను ఇక్కడికి రమ్మనండి. తనచేత అఖండ దీపం వెలిగించి.. హోమం చేయిస్తాను. అంతా మంచే జరుగుతుంది.. అని పూజారీ చెబుతాడు. దీంతో వెంటనే దీపను చెబుతాను.. అని తన తండ్రి అంటాడు.
ఇంతలో ఈ మాటలు విన్న మోనిత.. దీప రేపు గుడికి వస్తుందా? ఓకే అయితే.. తన చావు ముహూర్తాన్ని రేపు ఫిక్స్ చేస్తా.. అని చెప్పి.. ఇంతలో వీళ్లను ఒక ఆట ఆడుకుంటా.. అని మోనిత అనుకుంటుంది.
కట్ చేస్తే.. దీప, తన పిల్లలతో కలిసి.. కారులో ఇంటికి వెళ్తూ.. తన భర్త దగ్గర జరిగిన ఘటనలు, ఏసీపీ.. ఛీప్ గా చూడటం.. అన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. ఇంకెన్ని రోజులు డాడీ అక్కడుంటాడు. డాడీ అసలు అక్కడ ఎలా ఉంటున్నారో అర్థం కావడం లేదు. నానమ్మకు, తాతయ్యకు.. చాలామంది పెద్దవాళ్లు తెలుసు కదా. అసలు.. డాడీని ఎందుకు బయటికి తీసుకురావడం లేదు.. అని మళ్లీ వంద ప్రశ్నలు అడుగుతారు పిల్లలు. నాన్నను ఎలా బయటికి తీసుకురావాలనేది నేను చూసుకుంటారు సరేనా.. అని చెప్పి వాళ్లను ఓదార్చుతుంది దీప.
కట్ చేస్తే.. సోది చెబుతాను అమ్మ.. సోది చెబుతాను… అంటూ ముసుగు వేసుకొని మోనిత అక్కడ కూర్చుంటుంది. భాగ్య వినాలని.. గట్టిగా సోది చెబుతాను.. అంటూ అరుస్తుంది మోనిత. భాగ్య.. విని సోది చెబుతుందట… దీపకు ఏం జరుగుతుందో వెళ్లి చెప్పించుకుందాం.. అని భాగ్య అడుగుతుంది. వద్దే అంటాడు తన భర్త. ఏమయ్యా.. దీప జీవితం బాగుండాలి కదా.. నేను చూపించుకుంటా.. అని అంటాడు. సోదమ్మను చూడు.. ఆ ఠీవీ, ఆ దర్పం చూస్తుంటే అన్నీ నిజం చెప్పేట్టు ఉంది. పదా అయ్యా.. అంటూ ఆయన్ను తీసుకెళ్తుంది.
కట్ చేస్తే దీప.. ఇంటికి వచ్చేస్తుంది. అమ్మా.. ఒక్కటి అడగొచ్చా.. అని శౌర్య అంటుంది. ఇదొక్కటే చెబుతాను. నాకనిపించిందే చెబుతాను. ఆ ఏసీపీ మేడమ్ ఉండగా.. నాన్న ఇంటికి రాడని అనిపించింది అమ్మా. నీకేమనిపించింది. నాకనిపించిందే నిజం. ఆ మేడం టిఫిన్ కూడా చేయనివ్వలేదు. స్టేషనా.. క్యాంటినా? అని అడిగింది. మీరు క్యాంటీన్ లో పని చేస్తున్నారా? అని అడుగుదామని అనుకున్నా.. అంటూ శౌర్య అంటుంది.
ఆమె ఒక రోజు మన ఇంటికి వచ్చింది కదా.. అప్పుడు నాన్నను తీసుకెళ్లకుండా.. ఇప్పుడు ఎందుకు తీసుకెళ్లింది.. అంటూ ఏవేవో ప్రశ్నలు అడుగుతుంది శౌర్య. అత్తమ్మా.. ప్లీజ్ నువ్వు లేనిపోని ప్రశ్నలు వేసి ఏదేదో చెప్పి.. చదువును పక్కన పెట్టకు.. అని చెప్పి పిల్లలను ఇంట్లోకి తీసుకెళ్తుంది.
కట్ చేస్తే.. మోనిత.. భాగ్య చేయిని చూస్తుంది. నీకు చాలా కష్టం వచ్చింది. నీ పెద్ద కూతురు అంటే నీ కడుపులో పుట్టకపోయినా.. కన్న కూతురులా చూసుకుంటున్నావు. ఇది నా మాట కాదు. ఆ తల్లి మాట. ఆ తల్లి నాతో నిజమే చెప్పిస్తాది. దీప కొండెక్కేలా నేను చేస్తాను… అంటూ ఏదేదో అంటుంది.
దీంతో ఏంటి నువ్వనేది అని అనగానే.. దీప గండం గట్టేకేలా నేను చేస్తాను. దానికి పరిష్కారం కూడా దొరికింది. నీ పెట్టకు.. పుంజుతోనే సమస్య కదా. పెట్టకు మంచి రోజులు రావాలన్నా.. నేను చెప్పినట్టు చేయాలి. సమస్య పెట్టది కాబట్టి.. పెట్టే చెయ్యాలె. రేపు ఉదయం 6.20 నిమిషాలకు నేను చెప్పిన గుడి దగ్గరకు రమ్మను. దెబ్బకు పుంజు కలుగు నుంచి బయటికి వస్తాది.. అని చెబుతుంది మోనిత.
తనను తప్పకుండా పంపిస్తాను. తనతో పాటు నేను కూడా వస్తాను.. అని చెబుతుంది. దీంతో చెప్పాను కదా. పెట్ట ఒక్కతే రావాలి. ఇంకెవరూ రాకూడదు. మంత్రం పనిచేయదు.. అని చెబుతుంది. దీంతో తనను ఒక్కదాన్నే పంపిస్తా.. అని చెప్పి భాగ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
అయితే.. నీకేం తెలియదు అంటావు.. అని ఏసీపీ.. కార్తీక్ తో అంటుంది. నేను పోయే ప్రాణాన్నే కాపాడటానికి ఎంతో శ్రమిస్తాను. కానీ.. నేనెందుకు మోనిత ప్రాణం తీస్తాను.. అని అంటాడు కార్తీక్. మోనిత చాలా చేయగలదు. ప్రెగ్నెన్సీని వాడుకోవడం కోసం సైన్స్ ను వాడుకుంది. నేను తనకు దక్కనని తెలిసి ఇదిగో నన్ను ఇలా దోషిని చేసింది.
అని చెప్పినా ఏసీపీ మాత్రం కార్తీక్ మాటలు అస్సలు నమ్మదు. స్టాప్ ఇట్.. నీ నేరానికి .. మోనిత ఉన్మాదంతో కూడిన ప్రేమకథను తయారు చేసి.. ఇన్ని మసాలాలు దట్టించి చెబుతుంటే.. నాకు కోపం వస్తుంది కార్తీక్. నటించకండి కార్తీక్.. నిన్నటి దాకా నేరం ఒప్పుకున్నట్టు మాట్లాడి.. శిక్ష పడటం ఖాయం అని వైరాగ్యం వెదజల్లి.. ఇప్పుడు భార్యాపిల్లలు రాగానే.. వైరాగ్యం పోయి.. కొత్త రాగం స్టార్ట్ అయింది.. అని ఏసీపీ అనగానే.. మీరు నన్ను కేసు నుంచి వదిలేయాల్సిన అవసరం లేదు.
కానీ.. నన్ను ఈ ప్రశ్నలు మాత్రం మళ్లీ మళ్లీ అడిగి విసిగించకండి.. అని డైరెక్ట్ గానే కార్తీక్.. ఏసీపీ రోషిణికి చెబుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే.. శనివారం.. ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.