Karthika Deepam Monday Episode Highlights : కార్తీక దీపం 1105 ఎపిసోడ్ ఇప్పటికే శనివారం ప్రసారం అయింది. ఆదివారం సీరియల్ ప్రసారం కాదు. డైరెక్ట్ గా సోమవారం ప్రసారం కానుంది. అయితే.. సోమవారం ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం ఎపిసోడ్ లో అంజి అసలు రిజిస్టర్ ఆఫీసుకే ఫోన్ చేయడలేదని మోనితకు తెలుస్తుంది. రోషిణి మేడమ్, దీప కలిసి ఆడిన నాటకం అని తెలుస్తుంది. దీంతో మోనిత ఫుల్ ఖుషీ అయి బిర్యానీ పార్టీ చేసుకుంటుంది. వెంటనే కార్తీక్ కు ఫోన్ చేసి మాట్లాడుతుంది మోనిత. కారులో దీప ఉన్నప్పుడే మోనిత.. కార్తీక్ కు ఫోన్ చేస్తుంది. కార్తీక్ ను రెచ్చగొడుతుంది. దీంతో కారులో రివర్స్ లో మోనిత ఇంటికి వెళ్తారు దీప, కార్తీక్. పిల్లలకు కూడా చెప్పకుండా వాళ్లు బయటికి వెళ్లడంతో.. పిల్లలు కాస్త భయపడతారు. హిమ, శౌర్య.. ఇద్దరూ తెగ టెన్షన్ పడుతారు. కనీసం ఎక్కడికి వెళ్తారో కూడా చెప్పరు.. వీళ్లకు ఏం పనులు ఉంటాయి బయట.. అంటూ వాళ్లకు వాళ్లే మాట్లాడుకుంటారు.
కట్ చేస్తే మోనిత కాల్ లో మాట్లాడుతుండగానే.. కార్తీక్, దీప తన ఇంటికి వస్తారు. నేనేదో బెదిరించాలని ట్విస్ట్ ఇస్తే.. వీళ్లు ఇక్కడికి ఊడిపడి నాకు ట్విస్ట్ ఇచ్చారేంటి.. అని షాక్ అవుతుంది మోనిత. వెంటనే ప్లేట్ మార్చిన మోనిత.. థాంక్స్ అక్క.. మన ఉమ్మడి మొగుడిని నాకు అప్పగించడానికి వచ్చావా? అంటూ ఏదేదో అనబోతే.. కార్తీక్, దీప ఇద్దరూ నవ్వేస్తారు. తను బిర్యానీ తినడం చూసి.. ఇంతా పైశాచికానందం పొందుతున్న మోనితను చూసి తన అసలు స్వరూపం తెలిసింది.. అని కార్తీక్ అనడంతో.. దీన్ని ఇలా చేయొద్దు.. అంజిని తీసుకొచ్చి దీని ముందు నిలబెడితేనే అసలు విషయం తెలుస్తుంది. ముందు అంజిని తీసుకొచ్చి.. దీని పొగరు, శాడిజం, లెక్కలేని తనం.. అన్నింటినీ ఏరిపారేయాలంటే.. అంజినే కరెక్ట్.. అని దీప మోనితకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతారు.
ఇక.. సోమవారం ఎపిసోడ్ లో అంజి కోసం ఒకవైపు మోనిత.. మరోవైపు డాక్టర్ బాబు, దీప వెతకడం ప్రారంభిస్తారు. ఎందుకంటే అంజి దొరికితేనే ఈ కథకు పుల్ స్టాప్ పడుతుంది. మోనిత, డాక్టర్ బాబు పెళ్లి జరగకుండా ఉండాలన్నా… డాక్టర్ బాబు, దీప.. ఇద్దరూ సంతోషంగా ఉండాలన్నా కూడా అంజి దొరకాల్సిందే. మరి.. అంజి గురించి సోమవారం ఎపిసోడ్ లో ఏదైనా జాడ దొరుకుతుందో వేచి చూద్దాం.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.