Pawan Kalyan – KCR : అవునా.. నిజమేనా. కేసీఆర్, పవన్ కళ్యాణ్ మధ్య అంత రిలేషన్ షిప్ ఉందా? 2024 లో చంద్రబాబును ఓడించేందుకు పవన్ కళ్యాణ్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.1000 కోట్లు ఇచ్చారా? అది నిజమేనా. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ఇదే చర్చ నడుస్తోంది. అసలు.. ఏపీకి చెందిన చంద్రబాబు ఓడిపోతే.. తెలంగాణలో కేసీఆర్ కు వచ్చే లాభం ఏంటి అని అందరూ మాట్లాడుకుంటున్నారు. 2024 లో చంద్రబాబును ఏపీలో మళ్లీ ఓడించాలని..దాని కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారట. ఆ ఒప్పందం విలువ రూ.1000 కోట్లు అట.
ఇదంతా చెప్పింది ఎవరో కాదు.. ఎల్లో మీడియాగా పేరొందిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ ఎండీ ఆర్కే చేసిన వ్యాఖ్యలు. ఆర్కే పలుకు పేరుతో ఆయన రాసిన రాతలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏపీలో టీడీపీకి జనసేనను దూరం చేయాలని, కాపు సామాజిక వర్గం ఓట్లను దూరం చేయాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారట. అందుకే పవన్ కళ్యాణ్ కు కేసీఆర్ రూ.1000 కోట్ల ఆఫర్ ఇచ్చారట. కాపు నాయకులు పవన్ కళ్యాణ్ కు బ్రెయిన్ వాష్ చేస్తున్నారని.. అందుకే ఏపీ కాపు నాయకులు.. ఇప్పటికే పవన్ తో మాట్లాడారని చెప్పుకొచ్చారు. అంతే కాదు..
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తెలంగాణ నుంచి రూపాయి కూడా నిధులు రాకుండా అడ్డుకోవడం కోసం.. హైదరాబాద్ లో ఉండే ఆంధ్రా వ్యాపారులను కూడా కేసీఆర్ కట్టడి చేసే పనిలో పడ్డారట. అంటే.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలిచే అవకాశాలు ఉన్నాయని.. ఆ అవకాశాలను కావాలని కేసీఆర్ చెడగొడుతున్నారనే ఉద్దేశం వచ్చేలా ఆర్కే పలుకు ఉండటం గమనార్హం. అసలు.. రాధాకృష్ణకు ఇవన్నీ విషయాలు ఎలా తెలిశాయి. పవన్ కు కేసీఆర్ ఆఫర్ ఇచ్చారా? లేక.. కావాలని చంద్రబాబును హైలెట్ చేయడం కోసం.. కేసీఆర్ ను అడ్డం పెట్టుకొని ఎల్లో మీడియా పేరుతో చంద్రబాబు చెప్పినట్టుగా ఆర్కే తానా అంటే తందానా అన్నట్టుగా అంటున్నారా అంటూ రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.