Home » Andhra Pradesh » Kesineni Nani Shocking Act Against Chandrababu
andhra pradesh

Chandrababu : ఫాఫం చంద్రబాబు.! కసి తీరా విసిరికొట్టిన కేశినేని నాని.!

Authored By
aruna
The Telugu News | Published on: August 7, 2022, 6:30 am
Advertisement

Chandrababu : అధినేత చంద్రబాబు ఢిల్లీకి వస్తే, పార్టీకి చెందిన నేతలు సాదరంగా ఆహ్వానం పలకడం మామూలే. గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్‌నాయుడు సహా పలువురు ఎంపీలు చంద్రబాబుకి సాదరంగానే ఘన స్వాగతం పలికారు. కానీ, గత కొద్దిరోజులుగా చంద్రబాబు తీరుతో విసిగిపోయిన ఎంపీ కేశినేని నాని మాత్రం, టైమ్ చూసి ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, చంద్రబాబుని రిసీవ్ చేసుకునేందుకు వెళ్ళారు. చంద్రబాబుని సన్మానించారు ఎంపీలు. పుష్పగుచ్చం ఇచ్చేందుకు కేశినేని నానికి అవకాశం ఇవ్వగా, దాన్ని కేశినేని నాని విసురుగా తిప్పి కొట్టారు. చేసేది లేక గల్లా జయదేవ్ చంద్రబాబుకి ఆ పుష్పగుచ్చాం ఇచ్చారు.

Advertisement

ఈమాత్రందానికి కేశినేని నాని, చంద్రబాబుకి ఆహ్వానం పలికిన టీడీపీ ఎంపీల బృందంలో వుండడమెందుకు.? అన్న ప్రశ్న తలెత్తడం సహజమే. మీడియా ముందే చంద్రబాబు పరువు తీసెయ్యాలని బహుశా కేశినేని నాని అలా చేసి వుండొచ్చన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చ. గత కొంత కాలంగా టీడీపీలో ఇమడలేకపోతున్నారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. ఆ మాటకొస్తే, పార్టీలో తనను పట్టించుకోవడంలేదని కేశినేని బాహాటంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. తన కంటే వయసులో చిన్నవారైన రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్‌లకు పార్టీలో అధిక ప్రాధాన్యతనివ్వడాన్ని, లోక్ సభ కార్యకలాపాలకు సంబంధించి కూడా వారికే ఎక్కువ ప్రాధాన్యతనివ్వడాన్ని కేశినేని నాని జీర్ణించుకోలేకపోతున్నారు.

Kesineni Nani Shocking Act Against Chandrababu

Advertisement

పైగా, కేశినేని నాని కుమార్తె శ్వేత విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తే, ఆమెను ఓడించేందుకు చంద్రబాబు భజన బృందంలోని కొందరు ప్రయత్నించారన్న ‘కసి’ కూడా వుంది కేశినేని నానికి. ఎప్పటికప్పుడు అధినేత మీద తన అసహనాన్ని గట్టిగానే వెల్లగక్కుకున్న కేశినేని నాని, కేంద్ర ప్రభుత్వ పిలుపుతో చంద్రబాబు ఢిల్లీకి వచ్చిన సందర్భాన్ని ఇంకాస్త బాగా ఉపయోగించుకున్నారంతే.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి