Home » Andhra Pradesh » Kethireddy Strong Counter To Nara Lokesh Comments
andhra pradesh

MLA KethiReddy : పిచ్చి కుక్క మాదిరిగా అంటూ నారా లోకేష్ కి ఎమ్మెల్యే కేతిరెడ్డి కౌంటర్ వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: April 4, 2023, 12:00 pm
Advertisement

MLA KethiReddy : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గం లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పై లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు సంచలనాలు సృష్టిస్తున్నాయి. చెరువు ఆక్రమించుకుని కబ్జా చేసి విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టుకున్నారని… ఎమ్మెల్యే కేజీ రెడ్డి పై విమర్శలు చేయడం మాత్రమే కాదు డ్రోన్ ద్వారా చిత్రీకరించి వీడియో కూడా పోస్ట్ చేయటం సంచలనం సృష్టించింది. పరిస్థితి ఇలా ఉంటే తనపై లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలకు ఎమ్మెల్యే కేతిరెడ్డి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో ఇరిగేషన్ ల్యాండ్ లో

Advertisement

MLA KethiReddy Strong Counter To Nara Lokesh Comments

ముఖ్యమంత్రి చంద్రబాబు కట్టుకున్న నివాసం వద్ద ఎమ్మెల్యే కేతిరెడ్డి వీడియో చిత్రీకరించి లోకేష్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు ఇవ్వడం జరిగింది. రెండు కేటుగాడు అంటున్నావ్ మరి నువ్వు 24వ పులకేశివ నువ్వు. ఎవడో ఏదో చెప్పి స్క్రిప్ట్ రాసేస్తే దాన్ని చదువుకుంటూ పోతావు. ఇదే సమయంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో… స్థలాలు కబ్జా చేయడానికి చేస్తున్నట్లు లోకేష్ చేసిన వ్యాఖ్యలను కేతిరెడ్డి ఖండించారు. 2008 నుండి ఈ కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. అప్పట్లో సోషల్ మీడియా లేదని స్పష్టం చేశారు. అంత అంకితభావంతో చేయటం వల్లే నియోజకవర్గంలో త్రాగునీరు సమస్య లేదని పేర్కొన్నారు. నేను రైతు భూములను కబ్జా చేశానని నిరూపిస్తే…

Advertisement

ఒక్క రైతు ద్వారా ఆయన చెప్పిస్తే రాజీనామాకు సిద్ధమని ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లేకపోతే నువ్వు రాజకీయాల నుండి రాజీనామా చేస్తావా అని లోకేష్ కి సవాల్ విసిరారు. ఇదే సమయంలో నువ్వు చేసేది పెద్ద రాజకీయాలు కాదు ప్రతి నియోజకవర్గంలో పిచ్చి కుక్క మాదిరిగా అర్రుచుకుంటూ వెళ్తున్నావు. ఉనికి కోసం ఏదో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. లేకపోతే మీ నాన్న రాజకీయాల నుంచి తప్పుకుంటాడా అని చంద్రబాబుకి సవాల్ విసిరారు. ఇసుకతో అసలు సంబంధం లేదని పేర్కొన్నారు. ఏపీ గ్రూప్ అనే సంస్థ వారు ఇసుక రవాణా చేసుకుంటున్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డి స్పష్టం చేశారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు నిరూపించిన రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. ఎమ్మెల్యే కేతిరెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి