Home » Andhra Pradesh » Kethireddy Strong Reply To Reporter
andhra pradesh

KethiReddy : రిపోర్టర్ కి దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: March 21, 2023, 9:00 am
Advertisement

KethiReddy : ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని అందరికీ తెలుసు. ప్రజా సమస్యల విషయంలో పార్టీలకతీతంగా స్పందిస్తారు. ముఖ్యంగా ఆయన చేపట్టిన గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం స్టేట్ వైడ్ హైలైట్ అయింది. ఎమ్మెల్యే అంటే… కేతిరెడ్డి మాదిరిగా ఉండాలని చాలామంది ఆయన వీడియోలకు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే ఇటీవల పట్టాబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.

Advertisement

Kethireddy Strong Reply to Reporter

ఎన్నికలలో కొన్నిచోట్ల తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది. ముఖ్యంగా వైసిపి బలంగా ఉండే రాయలసీమ వంటి చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో అవకతవకులు జరిగినట్లు అంతకుముందే  ఎమ్మెల్యే కేతిరెడ్డి వీడియో రూపంలో సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. వైసీపీకీ పోలైన ఓట్లు..

Advertisement

టీడీపీ అభ్యర్ధికి కలిపేశారని ఆరోపించడం జరిగింది. అయితే ఈ విషయం పై సోమవారం అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే కేతిరెడ్డి… మాట్లాడుతూ రిపోర్టర్ కి దిమ్మతిరిగే పంచ్ డైలాగులు వేశారు. గెలుపోటములు సహజం. అయితే ఆ ప్రక్రియలో లోపాలను ప్రజల దృష్టికి తీసుకురావడం అధికార పార్టీ నేతలుగా మా బాధ్యత రాజా అంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి అదరగొట్టే కౌంటర్లు రిపోర్టర్లకు ఇచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి