Home » Adilabad » Indiramma Housewarming Party In Aliabad
adilabad

Indiramma House : అలియాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం ..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: February 22, 2026 8:20 pm
Advertisement

Indiramma House : అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్‌గాడి మలక్‌పేటలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్, జిల్లా ఆర్టీఏ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి, అలియాబాద్ మున్సిపల్ చైర్మన్ కంఠం శిరీష కృష్ణ రెడ్డి, అలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంకి రమేష్, 15వ వార్డు కౌన్సిలర్ నెమురి స్వప్న రాంప్రసాద్ పాల్గొన్నారు. వీరితో పాటు కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Advertisement

Indiramma House : అలియాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం ..!

ఈ సందర్భంగా 15వ వార్డుకు చెందిన లబ్ధిదారురాలు మిరపకాయల నవ్య రాజశేఖర్ సుమారు రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని నాయకులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కొత్త ఇంటి నిర్మాణం పూర్తవడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించిన సహాయంతో తమ కల సాకారమైందని వారు తెలిపారు. అనంతరం 14వ వార్డులో మరో ఇద్దరు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ తలారి మౌనిక బాబు కూడా పాల్గొన్నారు. మంజూరు పొందిన లబ్ధిదారులు త్వరలోనే ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించాలని సూచించారు.

Advertisement

కార్యక్రమంలో పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు సురక్షిత గృహ వసతి కల్పించడం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. గృహప్రవేశం అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అతిథులను సన్మానించారు. ఇందిరమ్మ ఇళ్లు పూర్తికావడంతో లబ్ధిదారులు నాయకులకు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి