know the secret behind tea making
Tea : అసలే శీతాకాలం.. ఆపై విపరీతమైన చలి.. వేడివేడిగా ఎదైనా తాగాలని అనిపిస్తుంది. దీంతో వెంటనే అందరికీ ఒకటి గుర్తుస్తుంది. అది తాగితే గానీ కొందరు బెడ్‌పై నుంచి దిగరు. మరికొందరికైతే అది తాగకపోతే అసలు ఏమి తోచదు. ఇంతకీ అది ఏంటంటారా? అదేనండి చాయ్.అతి చౌకగా దొరుకుతుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ సినిమాలో ఏకంగా చాయ్‌పై ఓ పాట కూడా ఉంది. ‘‘చాయ్ చటుక్కున తాగురా బాయ్’’ అన్న పాట అప్పట్లో చాలా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఈ పాటను చిరంజీవి స్వయంగా పాడారు. అయితే ఈ సినిమా కంటే ముందు 80 దశకంలో వచ్చిన సినిమాల్లో చాలా సందర్భాల్లో టేబుల్‌పై ఉంచిన టీలో పాలు కలుపుకుని తాగడం మనం గమనించే ఉంటాం.
అయితే ఇలా ఎందుకు చేస్తారో? ఎప్పుడైనా ఆలోచించారా? సాధారణంగా మన ఇళ్లలో ముందుగా టీ మరిగించి వెంటనే పాలు కలుపుతారు.బ్రిటన్‌లో మాత్రం టీ కోసం పాలు విడిగా పెడుతుంటారు. అసలు అలా చేయడానికి ఏమైన కారణం ఉందా? లేక రుచి కోసం అలా చేస్తున్నారా? ముందుగా చాయ్ ఎప్పుడు నుంచి తయారైందో తెలుసుకుందాం. టీ 18 శతాబ్దాంలో మొదటిసారి బ్రిటన్‌లో పాచుర్యం పొందింది. అప్పట్లో టీ కుండల్లో తయారు చేసేవారు. ఈ టీని తాగడానికి చైనా మట్టి కప్పులు వాడేవారు.
know the secret behind tea making
వేడివేడి చాయ్ అందులో పోసేసరికి అవి పగలిపోయేవి. దీంతో అక్కడి వారికి ఓ ఐడియా వచ్చింది. ముందుగా కప్పులో పాలు పోసి… అందులో వేడివేడి టీ పోసేవారు. దీంతో టీ ఉష్ణోగ్రత తగ్గడానికి పాలు సహయపడేవి. దీంతో మట్టి కప్పులు పగిలిపోయేవి కాదు. అప్పటి నుంచి ఈ ట్రెండ్ అలా మొదలైంది. అప్పట్లో టీ చాలా ఖరీదైంది. పైగా ఎక్కవ జనాభా పేదరికంలో మగ్గుతోంది. దీంతో టీ కప్పులు పగలకుండా ఈ పద్దతిని అనుసరిస్తుండేవారు. క్రమక్రమంగా ఇది ప్రపంచవ్యాప్తమైంది. తాజాగా ఓ నివేదిక ప్రకారం టీ ఇలా చేయడంతో రుచి కూడా పెరిగిందంటా.
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
This website uses cookies.