Kodali Nani : సీబీఐ అనే దర్యాప్తు సంస్థతో సీఎం జగన్ ని టార్చర్ పెట్టడానికి చంద్రబాబు అండ్ కో ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇటీవల మీడియా సమావేశంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో సంచలనం రేపుతున్నాయి. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కు సంబంధించి ఇటీవల సీబీఐ దర్యాప్తు సంస్థ కీలక వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న కామెంట్లను ఖండిస్తూ కొడాలి నాని గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో పాదయాత్రలో లోకేష్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. సీబీఐ చెప్పక ముందే 40 కోట్ల డీల్ సెట్ అయినట్లు లోకేష్ ఎలా కామెంట్లు చేశారని ప్రశ్నించారు. జగన్ ని గ్రూప్ లో పెట్టుకోవడానికి పిచ్చి ప్రయత్నాలు చేస్తే అవి ఫలించవు.
ఏదేమైనా దేశంలో కోర్టులు చట్టాలు ఉన్నాయి. ఎవరో కూడా ఎవరిని అన్యాయంగా ఇరికించలేరు. జగన్మోహన్ రెడ్డి మీ చేతిలో కీలుబొమ్మగా మారాలని మీరు భావిస్తే… అది రివర్స్ ఎటాక్ కావటం తప్పదు. సీబీఐ… కేంద్రం చేతిలో కీలుబొమ్మ, మోడీ ఏది చెప్పితే ఆ సంస్థ ఆ రీతిగా నడుస్తుంది. కాబట్టి సీబీఐనీ తాను బ్యాన్ చేస్తున్నట్లు అప్పట్లో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ప్రకటించడం అందరికీ తెలిసిందే. మరలాంటప్పుడు ఇప్పుడు సీబీఐ పేరు ప్రస్తావిస్తూ చంద్రబాబు ఎలా వ్యాఖ్యలు చేస్తారని కొడాలి నాని ప్రశ్నించారు. సీబీఐలో చాలామంది చంద్రబాబు మనుషులు ఉన్నారు. ఆ సంస్థ విచారణ జరిపే కేసులకు సంబంధించి ముందుగానే లీకులు
వస్తున్నాయి అని అప్పట్లో కేంద్రంలో ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి సీబీఐలు… చంద్రబాబును పచ్చపత్రికలు రాసే రాతలు… ఎవరిని ఏమీ చేయలేవని కొడాలి నాని తెలిపారు. కన్నా లక్ష్మీనారాయణ పనికిరాడు అని చెప్పి బిజెపి పక్కన పెట్టింది. ఇప్పుడు వెళ్లి అతను టిడిపిలో జాయిన్ అయ్యాడు. వయసులో ఉన్న సమయంలో మొత్తం బలమంతా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగించాడు. ఇప్పుడు వృద్ధాప్యానికి వచ్చాడు.. బిజెపి పక్కన పెట్టేసింది.. దీంతో కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం లో జాయిన్ అయినట్లు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొడాలి నాని తెలిపారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.