MLA KethiReddy ; ఏపీ రాజకీయాలలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పేరు తెలియని వారు ఉండరు. నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజా సమస్యల తీరుస్తూ తన నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల బాగోగులు దగ్గరుండి చూసుకుంటారు. ఫ్యాక్షన్ నేపథ్యం కలిగిన కుటుంబం అయిన గాని … నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యే అయ్యాక ఎక్కడ కూడా ఫ్యాక్షన్ లేకుండా చాలా జాగ్రత్తలు పడ్డారు. గొడవలు కారణంగా ఏ కుటుంబం నష్టపోకుండా… పార్టీలకతీతంగా పరిపాలన అందిస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి నిర్వహించే “గుడ్ మార్నింగ్ ధర్మవరం” కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
ధర్మవరం నియోజకవర్గంలో ఒకరోజు ఒకో ప్రాంతంలో పర్యటిస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి అక్కడికక్కడే పరిష్కారాలు చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ప్రాంతంలోకి వెళ్లిన సమయంలో ఓ అవ్వ మనవరాలు పట్టుకొని నిలబడింది. అయితే ఆమెను చూసిన ఎమ్మెల్యే కేతీరెడ్డి… సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. దానికి ఆమె ఇల్లు రాలేదని ఎమ్మెల్యేకి తెలియజేసింది. అయితే వెంటనే సదరు ఏరియా వాలంటీర్ తో పాటు అక్కడ సిబ్బందిని ఆమెకు ఎందుకు ఇల్లు రాలేదో.. రికార్డులు చెక్ చేయాలని కోరడం జరిగింది. అయితే అప్పటికే ఆమెకు సొంత ఇల్లు ఉన్నట్లు రికార్డులో తేలింది. దీంతో సొంత ఇల్లు ఉన్నవారికి కొత్త ఇల్లు ఇచ్చే ప్రసక్తి లేదని ఆమెకు ఎమ్మెల్యే బదులిచ్చారు.
కానీ ఆమె తమ ప్రాంతంలో సొంత ఇల్లు ఉన్న వారికి కూడా ఇల్లు వచ్చాయని ఎమ్మెల్యేకు చెప్పటంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. ఏ పనికిమాలినోడు చెప్పాడు ఇల్లు ఉన్న ఇల్లు వస్తదని. అటువంటిది ఏమీ కూడా సిస్టంలో లేవు. ప్రతిదీ కూడా… రికార్డెడ్ గా ఉంటుంది. ఏదో ఆన్లైన్ లో తప్పిదం జరిగి ఉంటది. మరోసారి ప్రతీది చెక్ చేయండి. లేకపోతే ఇల్లు ఉన్నవారు మరోసారి ఇల్లు కావాలని ఎందుకు అడుగుతారు అని అక్కడ సిబ్బందిని ఎమ్మెల్యే కేతిరెడ్డి గట్టిగా హెచ్చరించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Legs Arms : సూర్యకాంతి విటమిన్ డీ కి ముఖ్య మూలం అని చెప్పొచ్చు. అయితే విటమిన్ డీ లోపం ఉన్నవారు…
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
This website uses cookies.