Viral Video : వామ్మో.. స్కూల్లోప్రేర్ చేస్తుండ‌గా స్టూడెంట్‌ను వెన‌క నుంచి వ‌చ్చి తోసేసిన కొండ‌ముచ్చు..!

Authored By mallesh | The Telugu News | Updated on: November 23, 2021, 9:06 am

Viral Video సోష‌ల్ మీడియా అంటేనే వైర‌ల్ వీడియోల‌కు, ఫొటోల‌కు పెట్టింది పేరు. ఇప్పుడు ప్ర‌తి ఒక్కరి చేతిలోకి స్మార్ట్ ఫోన్లు రావ‌డంతో సోష‌ల్ మీడియా వాడ‌కం బాగా పెరిగిపోయింది. ప్ర‌పంచంలో ఎక్క‌డ ఏం జ‌రిగినా స‌రే క్ష‌ణాల్లోనే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిపోవ‌డం కామ‌న్ అయిపోయింది. నిజానికి సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాతే ఇలాంటి వైర‌ల్ వీడియోలు ప్ర‌పంచానికి తెలుస్తున్నాయి. అంత‌కు ముందు ఎక్క‌డ ఏం జ‌రిగినా స‌రే ఎవ‌రికీ పెద్ద‌గా తెలిసేది కాదు.

Viral Video స్టూడెంట్లు ప్రేర్ చేస్తుండ‌గా..

Kondamuchu pushed the student from behind

Kondamuchu pushed the student from behind

కానీ ఎవ‌రూ న‌మ్మ‌లేని, ఊహించ‌లేని వింతల‌కు సంబంధించిన‌వి ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి. ఎక్కువ‌గా జంతువుల‌కు సంబంధించిన వీడియోలే పాపుల‌ర్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా ఇలాంటి ఓ వైర‌ల్ వీడియోనే నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. దీన్ని చూసిన త‌ర్వాత అస‌లు అలా ఎలా జ‌రిగింద‌ని షాక్ అవుతారేమో. ఎందుకంటే అది ఎవ‌రూ ఊహించ‌న‌టువంటి సంఘ‌ట‌న‌. నిజంగా చూస్తే త‌ప్ప చెబితే ఎవ‌రూ న‌మ్మ‌న‌టువంటి ఘ‌ట‌న‌. ఓ స్కూల్ ముందు స్టూడెంట్లు అంద‌రూ క‌లిసి ప్రేర్ చేస్తున్న‌ట్టు మ‌నం ఈ వైర‌ల్ వీడియోలో చూడొచ్చు.

అయితే ఇలా స్టూడెంట్లు అంద‌రూ టీచ‌ర్ల వైపు తిరిగి ఉన్న స‌మ‌యంలో ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో తెలీదు గానీ ఓ కొండెంగ వెన‌కాల నుంచి వేగంగా వ‌చ్చి ఓ విద్యార్థినిని వెనక నుంచి ఎగిరి ఢీ కొడుతుంది. దీంతో ఆమె కింద ప‌డిపోతుంది. ఇక వెంట‌నే కొండెంగ మ‌ళ్లీ వెన‌క్కు వెళ్లిపోతుంది. ఇదంతా అక్క‌డే ఉన్న వారు వీడియో తీయ‌గా నెట్టంట్లో తెగ వైర‌ల్ అవుతోంది. అస‌లు అది ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో ఎవ‌రికీ అర్థం కావ‌ట్లేదు. మీరు కూడా చూసి కామెంట్ తెలియ‌జేయండి.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp