క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం .. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. క్రిష్ ఈ సినిమాని మొఘలాయిల కాలం నాటి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడు. వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ కమిటయిన నెక్స్ట్ సినిమా క్రిష్ దే. అయితే ఒకసారి కరోనా కొట్టిన దెబ్బ కి ఈ ప్రాజెక్ట్ దాదాపు 8 నెలలు ఆగిపోయింది. లాక్ డౌన్ కి ముందే మొదలైన ఈ సినిమా పవన్ కళ్యాణ్ లేకుండానే 15 రోజుల షెడ్యూల్ కంప్లీట్ చేశారు. అయితే హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా కోసం కోటి రూపాయలతో నిర్మించిన సెట్ కూలిపోవడం తో ఇక మళ్ళీ ఈ సినిమా షూటింగ్ మొదలవలేదు.
అయితే అన్ లాక్ తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో బిజీగా ఉండటం తో క్రిష్ మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ – రకుల్ ప్రీత్ సింగ్ తో కేవలం 45 రోజుల సింగిల్ షెడ్యూల్ లో ఒక సినిమా కంప్లీట్ చేశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతుండగా మార్చ్ నుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్ – క్రిష్ సినిమా మొదలవుతుందని వార్తలు వచ్చాయి. అందుకు కారణం అనూహ్యంగా పవన్ కళయాణ్ క్రిష్ సినిమా కాకుండా మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ కమిటవడమే. అయినా కూడా క్రిష్ .. పవన్ కళ్యాణ్ ని రిక్వెస్ట్ చేసి మధ్య మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు తన సినిమాకి డేట్స్ సర్దుబాటు చేయించుకున్నాడు.
అయితే క్రిష్ అదృష్ఠం కొద్ది అయ్యప్పనుం కోషియం కొన్ని కారణాల వల్ల డిలే అవడం తో పవన్ కళ్యాణ్ పిలిచి మరీ క్రిష్ కి దాదాపు 40 రోజుల కంటిన్యూ డేట్స్ ఇచ్చాడట. దాంతో ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఉన్న క్రిష్ వెంటనే పవన్ సినిమాని సెట్స్ మీదకి తీసుకు వెళ్ళేందుకు జనవరి 4 నుంచి షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాడు. కాని కరోనా క్రిష్ కి మళ్ళీ షాకిచ్చింది. క్రిష్ కి కరోనా సోకడం తో ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నాడు. 15 రోజుల పాటు బయటకి వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. దాంతో డేట్స్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎక్కడ జారిపోతాడో … అని క్రిష్ తెగ టెన్షన్ పడుతున్నాడట.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.