Home » Entertainment » Krithi Shetty First Job And Salary Details
Entertainment

Krithi Shetty : కృతి శెట్టి మొదటి జాబ్, సాలరీ ఏంతో తెలుసా .. ??

Authored By
aruna
The Telugu News | Published on: November 12, 2023, 12:30 pm
Advertisement

Krithi Shetty : తొలి సినిమాతో ఉప్పెనలా టాలీవుడ్ లో ఎగిసిన కృతి శెట్టి మొదటి సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్నారు. ఆ తర్వాత వరుస సినిమాలు చేశారు. ఆమె నటించిన మూడు సినిమాలు మంచి సక్సెస్ ను అందుకున్నాయి. ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ కావడంతో అవకాశాలు కాస్త తగ్గాయని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగుతో పాటు తమిళంలో కూడా పలు సినిమాలలో నటిస్తున్నారు. అయితే తాజాగా కృతి శెట్టి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె తన ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి ఇండస్ట్రీ లోకి రాకముందు ఏ జాబ్ చేసేవారో దాని గురించి చెప్పారు.

Advertisement

ఇండస్ట్రీ లోకి రాకముందు మీరు ఎలాంటి జాబ్ చేసేవారు అని, శాలరీ ఎంత అని అడిగారు. అయితే దీనికి కృతి శెట్టి సమాధానం చెబుతూ నేను కాస్త పెద్ద అయిన తర్వాత మా అమ్మకు కావలసిన ఇంట్లో వస్తువులన్నీ షాప్ కి వెళ్లి తీసుకువచ్చేదాన్ని. అదే నా ఫస్ట్ జాబ్ అని సమాధానం చెప్పారు. నేను ఇలా అమ్మతో సహాయం చేయగా అమ్మ నాకు తన దగ్గర ఉన్నటువంటి 100 రూపాయలు అప్పుడప్పుడు 150 రూపాయలు ఇచ్చేది. అదే నా ఫస్ట్ సాలరీ అంటూ సమాధానం చెప్పుకొచ్చారు. ఇలా తన తల్లికి హెల్ప్ చేసినందుకు ఆమె తన దగ్గర ఉన్నటువంటి కొంత డబ్బును తనకు ఇచ్చేదని కృతి శెట్టి వెల్లడించారు.

ఇలా తన వ్యక్తిగత విషయాల గురించి కృతి శెట్టి తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక చివరిగా నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా ద్వారా కృతి శెట్టి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైనప్పటికీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు రావడం లేదు. అయితే తాజాగా కృతి శెట్టి శర్వానంద్ సినిమాలో అవకాశం అందుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ కి మరే అవకాశాలు రానట్లుగా కనిపిస్తుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి