ktr
హైదరాబాద్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ నేతలకు శుభవార్త చెప్పారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని అన్నారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వారికి త్వరలో నామినేటెడ్ పోస్టులు కట్టబెడతామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కో ఆప్షన్ సభ్యుల నియామకం సైతం త్వరలోనే పూర్తిచేస్తామని కేటీఆర్ వెల్లడించారు. జలవిహార్‌లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ టీఆర్‌ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 20 లోగా సంస్థాగత కమిటీల నియామకం పూర్తి చేసి.. దీపావళి తరువాత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వచ్చే అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలు ఏర్పాటు చేసి ముందుకెళ్లాలని కేటీఆర్ సూచించారు.
bjp mla raja singh on ktr tweet over corona vaccine prices
టీఆర్‌ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల నాయకులపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీ -కాంగ్రెస్, టీ -బీజేపీ, కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా? మీకు పదవులు వచ్చాయంటే కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా? అని కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు కేసీఆర్ పుణ్యమా అని పదవులు రాగానే.. గంజిలో ఈగల్లాగా ఎగిరిపడుతున్నారు అని ఎద్దేవా చేశారు. చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. వయసులో మీ కంటే 20 ఏళ్ళ పెద్ద మనిషిని పట్టుకుని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. పేరుకే ఢిల్లీ పార్టీలు కానీ.. చేసేవి మాత్రం చిల్లర పనులు అని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌ను ఇష్టారీతిగా మాట్లాడుతున్న నేతలకు గట్టిగా సమాధానం చెప్పాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏడేళ్లు ఒపిక పట్టినా.. ఇక నుంచి ఆ పరిస్థితి ఉండదని విపక్షాలకు వార్నింగ్ ఇచ్చారు.
60 లక్షల పైచిలుకు సభ్యులతో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని… 33 జిల్లాల్లో జిల్లా పార్టీ కార్యాలయాలు కట్టుకున్నామని అన్నారు. మొన్న ఢిల్లీలో తెలంగాణ భవన్‌కు భూమి పూజ చేసుకున్నాం. ఇప్పుడు మన ముందు ఏ ఎన్నిక లేదు. హుజూరాబాద్ ఎన్నిక సమస్యే కాదని చెప్పారు. దాని కోసం సైన్యం ఉంటే సరిపోదు. ఇందుకు ఎక్కడికక్కడ కమిటీలు పటిష్టంగా ఉండాలి. జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలు ఏర్పాటు చేసి ముందుకెళ్లాలని సూచించారు. గ్రేటర్ పరిధిలో 4,800 దాకా కాలనీ అసోసియేషన్‌లు ఉన్నాయి.
all parties new plan on Huzurabad by poll
1486 నోటిఫైడ్ బస్తీలు ఉన్నాయి. మొత్తం కలిపి 6,300 దాకా కాలనీలు, బస్తీలు ఉన్నాయి. డివిజన్లతోపాటు వీటికి కూడా కమిటీలు వేసుకోవాలని చెప్పారు. సెప్టెంబర్ 29వ తేదీ లోపు బస్తీ, కాలనీ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ కమిటీలో 15 మందికి తగ్గకుండా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. డివిజన్ స్థాయిలో 150 డివిజన్ కమిటీలు వేసుకోవాలని.. ఈసారి జిల్లా కమిటీలు వేసుకోవాలని కేసీఆర్ చెప్పారని కేటీఆర్ వెల్లడించారు. పేదలకు ఏం కావాలో సీఎం కేసీఆర్‌కు తెలుసని కేటీఆర్ అన్నారు. వారి ఆశీర్వాదం ఉన్నంత కాలం టీఆర్‌ఎస్‌కు ఏమీ కాదని అన్నారు. విపక్షాల విమర్శలను ఎదుర్కొనేందుకు పార్టీ కమిటీలు ఎక్కడికక్కడ పటిష్టంగా ఉండాలని అన్నారు. ఎన్నికలు ఏదైనా.. ప్రజలు టీఆర్ఎస్‌కు పట్టం కడుతున్నారని పార్టీ శ్రేణులకు కేటీఆర్ గుర్తు చేశారు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.