
laww hat right do daughters have over fathers property here full details
LAW : ప్రస్తుత కాలంలో తండ్రి నుంచి వచ్చే ఆస్తిని కొడుకుల తో పాటు, కుమార్తెలు కూడా కావాలి అని అడుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే పూర్వకాలం నుంచే కొడుకులతో పాటు, కుమార్తెలు కూడా ఆస్తిలో వాటా వస్తుంది. అయితే ఆస్తిలో కుమార్తెలకు వారి తండ్రి నుంచి గాని, వారి తాతగారి నుంచి గానీ వచ్చే ఆస్తులలో సమాన వాటా ఉంటుంది కూతురుకి పెళ్లి అయినా, వితంతువు అయినా, పెళ్లి కాకుండా ఉన్న లేదా భర్తను వదిలేసిన , ఆమె పుట్టినప్పటి నుంచి వారసత్వంగా వస్తున్నటువంటి ఎలాంటి ఆస్తులలో అయినా సరే సమాన హక్కు ఉంటుందని చట్టం చెబుతోంది. అయితే కొంతమంది వారి తండ్రి మరణం తరువాత వారింటి ఆడపిల్లలకు ఆస్తిలో సమాన వాటాను ఇవ్వరు.ఇలాంటి సమస్యలలో ఇది ఒకటి.. రాములయ్య అనే ఈ వ్యక్తికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే రాములయ్య మరణించడంతో కుటుంబంలో ఆస్తి పట్ల సమస్యలు మొదలయ్యాయి. తమ సోదరికి ఆస్తి పంచుతున్నట్లు తెలియనివ్వకుండా. ఈ సోదరులే ఆస్తిని మొత్తం రెండు భాగాలుగా చేసుకొని పంచుకున్నారు. ఈ విషయం తెలియడంతో రాములయ్య కూతురు వైష్ణవి తన సోదరులతో గొడవకు దిగింది.
ఇలాంటి సమస్య ఒక్క ఈ రాములయ్య కుటుంబంలోనే కాకుండా, చాలా కుటుంబాల్లో కూడా ఇలానే జరుగుతుంది. ఎక్కువగా భూమికి సంబంధించిన సమస్యలే ఉన్నట్టు పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ ప్రకారం తెలుస్తోంది. అయితే ఆస్తి పంపకాల విషయంలో ఇప్పటికే కోర్టుల్లో 15 డిసెంబర్ 2021 నాటికి నాలుగున్నర కోట్ల కేసులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి.మరి ఆడపిల్లలకు ఆస్తుల విషయంలో ఎలాంటి గొడవలు వచ్చినా వాటిని పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది. అది ఏమనగా హిందూ వారసత్వ చట్టం దీన్ని 1956, 2005 లో సవరించారు.ఈ చట్టం ప్రకారం పూర్వీకుల నుంచి వారసత్వాంగా వచ్చే ఎలాంటి ఆస్తి లోనైనా ఆడపిల్లలకు సమాన హక్కు ఉంటుందని ఈ చట్టం తెలియజేస్తుంది.అయితే ఈ చట్టం ఒక షరతును కూడా పెట్టింది.అది ఏంటంటే 9 సెప్టెంబర్2005 వరకు తమ తండ్రి జీవించి ఉంటేనే కుమార్తెలకు వారి వారసత్వంగా వస్తున్న ఆస్తిలో వాటా ఉంటుంది. అలా కాకుండా 9 సెప్టెంబర్2005 నాటికి తమ తండ్రి మరణించి ఉన్నట్లయితే వారికి ఆస్తిలో ఎలాంటి వాటా ఉండదు. అయితే తండ్రి తానే స్వయంగా కొనుగోలు చేసిన, వీలునామాల ప్రకారం కుమార్తెలకు వాటా ను విభజిస్తారు.
laww hat right do daughters have over fathers property here full details
అయితే సుప్రీంకోర్టు ఈ రూల్ ని మారుస్తూ 2020లో ఒక స్పష్టత ఇచ్చింది. అది 9 సెప్టెంబర్ 2005 నాటికి తండ్రి బ్రతికి ఉన్న లేదా మరణించిన కుమార్తెలకు, కొడుకుల తో పాటు సమానమైన హక్కు కలిగి ఉంటుంది.అయితే ఒకవేళ తండ్రి తానే స్వయంగా కొనుగోలు చేసిన ఆస్తిలో వాటా ఇవ్వడం, ఇవ్వకపోవడం పూర్తిగా తండ్రి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కానీ వారసత్వంగా వచ్చే ఆస్తిలో మాత్రం కుమార్తెలకు, కుమారులకు సమానమైన వాటా ఉంటుంది. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది అనిల్ కర్న్వాల్ చెబుతున్నారు. ఒకవేళ తండ్రి వీలునామా రాయకముందే మరణిస్తే, తన తండ్రి ఆస్తులు కుమారు లతోపాటు, కుమార్తెలకు కూడా సమానమైన వాటా ఉంటుందని న్యాయవాది అనిల్ తెలుపుతున్నారు.ఇక రాములయ్య కూతురు సమస్యకు వస్తే వైష్ణవి తండ్రి ఎలాంటి వీలునామా రాయలేదు, కానీ చట్టప్రకారం వైష్ణవి కి తన తండ్రి ఆస్తిలో సమానమైన వాటా ఉంటుంది.కావున ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తగా వీలునామాను రాసుకోవడం మంచిది. ముఖ్యంగా అందులో కుమార్తె పేరు ను తనకు ఎంత వాటా చెందుతుంది అన్నా సమాచారాన్ని రాయడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల కుటుంబంలో ఎలాంటి గొడవలు జరగవు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.