
LIC బీమా సఖి యోజన.. మహిళల ఆర్థిక సాధికారతకు సరికొత్త అడుగు
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా సఖి యోజన’ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పథకం ద్వారా మహిళలు ఏ మాత్రం పెట్టుబడి పెట్టకుండానే నెలకు రూ.7,000 వరకు ఆదాయం పొందే అవకాశం కలుగుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళలకు ఉపాధి అవకాశాల కల్పనతో పాటు బీమా సేవల ప్రాధాన్యతను తెలియజేయాలనే లక్ష్యంతో ఈ స్కీమ్‌ను రూపొందించినట్లు LIC వెల్లడించింది.
Women : మహిళలకు గుడ్‌న్యూస్.. ఫ్రీగా 7000 మీకే.. ఎలా అంటే..?
బీమా సఖిగా పేరుగడించే మహిళలకు LIC ప్రత్యేక శిక్షణ కల్పించనుంది. శిక్షణ అనంతరం వీరు బీమా ఏజెంట్లుగా పని చేస్తారు. మొదటి సంవత్సరంలో నెలకు రూ.7,000, రెండవ సంవత్సరంలో రూ.6,000 వరకు ఆదాయం పొందే అవకాశముంది. అయితే రెండవ సంవత్సర ఆదాయాన్ని పొందాలంటే, మొదటి ఏడాది తీసుకున్న పాలసీలలో కనీసం 65% యాక్టివ్‌గా ఉండాలి.
అర్హతలు:వయస్సు 18 నుండి 70 సంవత్సరాల మధ్య ఉండాలి, కనీసం 10వ తరగతి పాసై ఉండాలి. ప్రస్తుతం లేదా గతంలో LIC ఏజెంట్లు/ఉద్యోగులు అయినవారు, వారి కుటుంబ సభ్యులు అర్హులు కాదు ఆసక్తి ఉన్న మహిళలు LIC నికటస్థ శాఖ కార్యాలయానికి వెళ్లి లేదా LIC అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుతో పాటు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, 10వ తరగతి స్టడీ సర్టిఫికేట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో సమర్పించాలి. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా వేలాది మంది మహిళలు ఉపాధి అవకాశాలను పొందగలిగే అవకాశం ఉంది. సమాజంలో బీమా సేవలపై అవగాహన పెరిగేందుకు కూడా ఇది ఓ కీలకపాత్ర పోషించనుంది.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.