Women : మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. ఫ్రీగా 7000 మీకే.. ఎలా అంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Women : మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. ఫ్రీగా 7000 మీకే.. ఎలా అంటే..?

 Authored By ramu | The Telugu News | Updated on :4 August 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Women : మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. ఫ్రీగా 7000 మీకే.. ఎలా అంటే..?

Women  : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా సఖి యోజన’ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పథకం ద్వారా మహిళలు ఏ మాత్రం పెట్టుబడి పెట్టకుండానే నెలకు రూ.7,000 వరకు ఆదాయం పొందే అవకాశం కలుగుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళలకు ఉపాధి అవకాశాల కల్పనతో పాటు బీమా సేవల ప్రాధాన్యతను తెలియజేయాలనే లక్ష్యంతో ఈ స్కీమ్‌ను రూపొందించినట్లు LIC వెల్లడించింది.

Women మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌ ఫ్రీగా 7000 మీకే ఎలా అంటే

Women : మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. ఫ్రీగా 7000 మీకే.. ఎలా అంటే..?

Women  : మంచి ప‌థ‌కం..

బీమా సఖిగా పేరుగడించే మహిళలకు LIC ప్రత్యేక శిక్షణ కల్పించనుంది. శిక్షణ అనంతరం వీరు బీమా ఏజెంట్లుగా పని చేస్తారు. మొదటి సంవత్సరంలో నెలకు రూ.7,000, రెండవ సంవత్సరంలో రూ.6,000 వరకు ఆదాయం పొందే అవకాశముంది. అయితే రెండవ సంవత్సర ఆదాయాన్ని పొందాలంటే, మొదటి ఏడాది తీసుకున్న పాలసీలలో కనీసం 65% యాక్టివ్‌గా ఉండాలి.

అర్హతలు:వయస్సు 18 నుండి 70 సంవత్సరాల మధ్య ఉండాలి, కనీసం 10వ తరగతి పాసై ఉండాలి. ప్రస్తుతం లేదా గతంలో LIC ఏజెంట్లు/ఉద్యోగులు అయినవారు, వారి కుటుంబ సభ్యులు అర్హులు కాదు ఆసక్తి ఉన్న మహిళలు LIC నికటస్థ శాఖ కార్యాలయానికి వెళ్లి లేదా LIC అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుతో పాటు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, 10వ తరగతి స్టడీ సర్టిఫికేట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో సమర్పించాలి. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా వేలాది మంది మహిళలు ఉపాధి అవకాశాలను పొందగలిగే అవకాశం ఉంది. సమాజంలో బీమా సేవలపై అవగాహన పెరిగేందుకు కూడా ఇది ఓ కీలకపాత్ర పోషించనుంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది