Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఐదు దశల్లో ఓటింగ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఐదు దశల్లో ఓటింగ్

 Authored By sandeep | The Telugu News | Updated on :29 September 2025,2:00 pm

Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC) రాణికుముదిని తాజాగా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ ప్రకారం, పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఐదు దశల్లో జరగనున్నాయి.రాష్ట్రంలోని 565 మండలాల్లోని మొత్తం 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిని రెండు విడతల్లో నిర్వహించనున్నారు.

#image_title

మొదటి విడత:

నోటిఫికేషన్ విడుదల – అక్టోబర్ 9

పోలింగ్ తేదీ – అక్టోబర్ 23

కౌంటింగ్ – నవంబర్ 11

రెండో విడత:

నోటిఫికేషన్ – అక్టోబర్ 13

పోలింగ్ – అక్టోబర్ 27

కౌంటింగ్ – నవంబర్ 11

మూడు దశల్లో గ్రామ పంచాయతీ, వార్డుల ఎన్నికలు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,733 గ్రామ పంచాయతీలు మరియు 1,12,288 వార్డులకు ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనున్నారు:

మూడో దశ:

నోటిఫికేషన్ – అక్టోబర్ 17

పోలింగ్ & కౌంటింగ్ – అక్టోబర్ 31

నాలుగో దశ:

నోటిఫికేషన్ – అక్టోబర్ 21

పోలింగ్ & కౌంటింగ్ – నవంబర్ 4

ఐదో దశ:

నోటిఫికేషన్ – అక్టోబర్ 25

పోలింగ్ & కౌంటింగ్ – నవంబర్ 8

ఓటర్ల వివరాలు:

మొత్తం ఓటర్లు: 1,67,03,168

పురుషులు: 81,65,894

మహిళలు: 85,36,770

ఇతరులు: 504

ఈ షెడ్యూల్ విడుదలతో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా తెలంగాణలో రాజకీయ వేడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రజలు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది