Malla Reddy : తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. ఇక తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయింది. మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొడుతుందని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఆరు గ్యారెంటీలతో ప్రజలను తమ వైపుకు తిప్పుకున్నారు. అయితే మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గతంలో చాలా సార్లు రేవంత్ రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పై మల్లారెడ్డి చాలా సార్లు సవాల్ కూడా చేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మల్లారెడ్డి గతంలో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అప్పుడు ఎట్లుండే మల్లారెడ్డి ఇప్పుడు ఎలా అయిండు అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
గతంలో మల్లారెడ్డి రేవంత్ రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నువ్వు గెలిస్తే మంత్రి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, తొడగొడుతూ నువ్వు గెలిస్తే నేను రాజకీయాలలో నుంచి తప్పుకుంటాను అని అన్నారు. నీకు దమ్ముంటే గెలిచి చూపించు, నేను ఛాలెంజ్ చేస్తున్నా. మూడోసారి కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని మల్లారెడ్డి ఛాలెంజ్ చేశారు. రేవంత్ రెడ్డి ఒక దొంగ. నేను అతడి లాగా బ్రోకర్ దందా చేయలేదు. కష్టపడి ప్రతి రూపాయిని సంపాదించినా లక్షల మందిని ఇంజనీర్లు చేశాను. లక్షల మంది వరల్డ్ క్లాసు డాక్టర్లను చేశాను. నన్ను బ్రోకర్ అంటాడా వాడు పెద్ద బ్రోకర్ , బ్లాక్ మెయిలర్, వాడు పదవిలోకి వస్తే నేను రాజీనామా చేస్తానని మల్లారెడ్డి అన్నారు.
దేశమంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కేసీఆర్ పెట్టిన పథకాలు ఎవరు పెట్టలేదని, రేవంత్ రెడ్డి కన్నా గాడిదలు నయం అని, లక్షల మందికి ఉద్యోగం కల్పించిన, ఒక చరిత్ర సృష్టించినా, రేవంత్ రెడ్డిని తిట్టడానికి నోరు కూడా పనికిరాదు, అంత దుర్మార్గుడు అని మల్లారెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. గతంలో అలా మాట్లాడిన రేవంత్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మీడియాతో ఇలా మాట్లాడారు. మనది ప్రజాస్వామ్య రాజ్యం. ప్రజల తీర్పు అందరికీ ఇష్టమే గెలిచిన వాళ్ళను కూడా సహకరిస్తాం. వాళ్లు కూడా మంచిగా ఆరు గ్యారంటీలను పెట్టారు. అవన్నీ నెరవేరిస్తే ప్రజలకు కూడా సంతోషం అని, ప్రజలు వాళ్లకు కూడా అవకాశం ఇచ్చారు. వాళ్ల దానిని సద్వినియోగం పరుచుకోవాలి అని అన్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.