KTR : తెలంగాణలో జరిగిన ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థాయిలో ఓట్లు సంపాదించుకొని అధికారాన్ని చేజిక్కు ఉంచుకుంది ఇక బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసింది అయితే ఆయన తాజాగా సిరిసిల్లలో బిఆర్ఎస్ ఆఫీసులో కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ పెద్దపెద్ద హామీలను ఇచ్చిందని, వాటిని నెరవేర్చే వరకు వెంట పడతామని అన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రజలకు అందించేందుకు గొంతు విప్పుతామని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వంద రోజులు నిర్విరామంగా పనిచేశారని, వారి కృషి వల్లే 39 సీట్లు సాధించామని తెలిపారు.
రెండు లక్షల రుణమాఫీ, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, ప్రతి ఒక్కరికి ఇండ్లు కట్టిస్తాం వంటి హామీలు కాంగ్రెస్ ఇచ్చిందని చెప్పారు. ఈ హామీలను ప్రజలు రాసి పెట్టుకున్నారని, కాంగ్రెస్ పార్టీ ఆ హామీలను నెరవేర్చకపోతే ప్రజల తరఫున మా గొంతు మాట్లాడుతుందని అన్నారు. ప్రతిపక్ష పాత్రను అద్భుతంగా పోషిస్తామని కేటీఆర్ తెలిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మూడు రోజుల్లోనే టిఆర్ఎస్ పార్టీకి విపరీతమైన సింపతి వచ్చిందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదా కెసిఆర్ సీఎం గా లేరా అని మెసేజ్ ల రూపంలో ఫీడ్ బ్యాక్ వస్తుందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారు కూడా మెసేజ్లు వీడియోలు అన్న ఇట్లా అయిపోయిందని సింపతి వ్యక్తం చేస్తున్నారు.
39 మంది ఎమ్మెల్యేలను ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు. కాంగ్రెస్ హామీలు నెరవేర్చకపోతే ప్రజలు గమనిస్తారు అని, మా పని మేము చేసుకుంటూ పోతాం ప్రజలు కాంగ్రెస్ పార్టీ పాలన గురించి ఆలోచిస్తారు అని, త్వరలోనే మేము ప్రజల విశ్వాసాన్ని చరగుంటామని, అది ఎంతో దూరంలో లేదు అని కేటీఆర్ అన్నారు. ఓటమి స్వల్పకాల విరామం మాత్రమే అని అన్నారు. కొంత నిరాశ ఉన్నప్పటికీ ఓటమికి భయపడేది లేదు అని కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో తాను ఇచ్చిన మాట ప్రకారం మద్యం, డబ్బులు పంచలేదని అన్నారు. తన మాటను గౌరవించు మెజారిటీతో గెలిపించిన సి సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యేగా గర్వపడుతున్నానని, కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవాలి అని కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.