
Marriage : మరీ ఇంత కక్కుర్తా.. డబ్బుల కోసం పెళ్లి చేసుకున్న అన్నా చెల్లెళ్లు..!
Marriage : డబ్బు మనిషిని ఎలా మార్చగలదో మనం చూస్తున్నాం. డబ్బులు కోసం గడ్డి తినేవాళ్లు ఎందరో. అయితే డబ్బుఉల వస్తాయన్న ఆశతో అన్నా చెల్లెలు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఇదే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అణగారిన వర్గాలకు చెందిన ప్రజలు పెళ్లిళ్లు చేసుకుంటే ప్రభుత్వం.. ఆర్థిక సాయం అందిస్తుందని అన్నా చెల్లెలు.. డబ్బుల కోసం పెళ్లి చేసుకున్నారు. సమాజం సిగ్గుతో తల దించుకునే ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారు పెళ్లి చేసుకుంటే ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం.. ముఖ్యమంత్రి సామూహిక్ వివాహ్ యోజన కింద.. ఆర్థిక సహాయం అందిస్తూ ఉంటుంది.
అతి తక్కువ ఆదాయాలు కలిగిన వారికి పెళ్లి చేసుకునేందుకు ఆర్థిక సాయం కోసం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఈ పథకాన్ని తీసుకువచ్చింది. అయితే హత్రాస్ జిల్లాలో ఈ ముఖ్యమంత్రి సామూహిక్ వివాహ్ యోజనను దుర్వినియోగం చేశారు. ఇద్దరు అన్నా చెల్లెలు పెళ్లి చేసుకుని ప్రభుత్వ సొమ్ముని కాజేయాలని చూడగా.. అధికారులు వారిని పట్టుకున్నారు. అన్నా చెల్లెలు పెళ్లి చేసుకున్న విషయాన్ని స్థానికులు.. అధికారుల దృష్టికి తీసుకురావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హత్రాస్ జిల్లాలోని సికిందరావు గ్రామంలో జరిగిన ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించగా అసలు విషయం బయటకు వచ్చింది.
Marriage : మరీ ఇంత కక్కుర్తా.. డబ్బుల కోసం పెళ్లి చేసుకున్న అన్నా చెల్లెళ్లు..!
సామూహిక్ వివాహ్ యోజన కింద పెళ్లి చేసుకున్న యువతికి రూ.35 వేల నగదు, రూ.10వేల విలువైన నిత్యావసర వస్తువులు, పెళ్లి ఖర్చుల కింద మరో రూ.6 వేలు ప్రభుత్వం అందిస్తోంది. అయితే స్థానిక వర్గాలు వెల్లడించిన ప్రకారం.. ఈ పథకం కింద పెళ్లి చేసుకుని అన్నా చెల్లెలు ప్రభుత్వ డబ్బును కొట్టేయాలనే ప్రయత్నాలను అధికారులు పసిగట్టారు. ఇక ఇప్పటికే పెళ్లి అయిన మరో రెండు జంటలు కూడా మళ్లీ డబ్బుల కోసం వివాహం చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్రట్ర వేద్ సింగ్ చౌహాన్.. ప్రభుత్వ ఖజానాకు గండికొట్టాలని చూసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని తేల్చి చెప్పారు.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.