Marriage : మ‌రీ ఇంత క‌క్కుర్తా.. డ‌బ్బుల కోసం పెళ్లి చేసుకున్న అన్నా చెల్లెళ్లు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Marriage : మ‌రీ ఇంత క‌క్కుర్తా.. డ‌బ్బుల కోసం పెళ్లి చేసుకున్న అన్నా చెల్లెళ్లు..!

 Authored By ramu | The Telugu News | Updated on :8 October 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Marriage : మ‌రీ ఇంత క‌క్కుర్తా.. డ‌బ్బుల కోసం పెళ్లి చేసుకున్న అన్నా చెల్లెళ్లు..!

Marriage : డ‌బ్బు మనిషిని ఎలా మార్చ‌గ‌ల‌దో మ‌నం చూస్తున్నాం. డ‌బ్బులు కోసం గ‌డ్డి తినేవాళ్లు ఎందరో. అయితే డ‌బ్బుఉల వ‌స్తాయ‌న్న ఆశ‌తో అన్నా చెల్లెలు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఇదే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అణగారిన వర్గాలకు చెందిన ప్రజలు పెళ్లిళ్లు చేసుకుంటే ప్రభుత్వం.. ఆర్థిక సాయం అందిస్తుంద‌ని అన్నా చెల్లెలు.. డబ్బుల కోసం పెళ్లి చేసుకున్నారు. సమాజం సిగ్గుతో తల దించుకునే ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారు పెళ్లి చేసుకుంటే ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం.. ముఖ్యమంత్రి సామూహిక్ వివాహ్ యోజన కింద.. ఆర్థిక సహాయం అందిస్తూ ఉంటుంది.

Marriage పెద్ద ప్లానే వేశారు..

అతి తక్కువ ఆదాయాలు కలిగిన వారికి పెళ్లి చేసుకునేందుకు ఆర్థిక సాయం కోసం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఈ పథకాన్ని తీసుకువచ్చింది. అయితే హత్రాస్ జిల్లాలో ఈ ముఖ్యమంత్రి సామూహిక్ వివాహ్ యోజనను దుర్వినియోగం చేశారు. ఇద్దరు అన్నా చెల్లెలు పెళ్లి చేసుకుని ప్రభుత్వ సొమ్ముని కాజేయాలని చూడగా.. అధికారులు వారిని పట్టుకున్నారు. అన్నా చెల్లెలు పెళ్లి చేసుకున్న విషయాన్ని స్థానికులు.. అధికారుల దృష్టికి తీసుకురావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హత్రాస్ జిల్లాలోని సికిందరావు గ్రామంలో జరిగిన ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించ‌గా అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

Marriage మ‌రీ ఇంత క‌క్కుర్తా డ‌బ్బుల కోసం పెళ్లి చేసుకున్న అన్నా చెల్లెళ్లు

Marriage : మ‌రీ ఇంత క‌క్కుర్తా.. డ‌బ్బుల కోసం పెళ్లి చేసుకున్న అన్నా చెల్లెళ్లు..!

సామూహిక్ వివాహ్ యోజన కింద పెళ్లి చేసుకున్న యువతికి రూ.35 వేల నగదు, రూ.10వేల విలువైన నిత్యావసర వస్తువులు, పెళ్లి ఖర్చుల కింద మరో రూ.6 వేలు ప్రభుత్వం అందిస్తోంది. అయితే స్థానిక వర్గాలు వెల్లడించిన ప్రకారం.. ఈ పథకం కింద పెళ్లి చేసుకుని అన్నా చెల్లెలు ప్రభుత్వ డబ్బును కొట్టేయాలనే ప్రయత్నాలను అధికారులు పసిగట్టారు. ఇక ఇప్పటికే పెళ్లి అయిన మరో రెండు జంటలు కూడా మళ్లీ డబ్బుల కోసం వివాహం చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్రట్ర వేద్ సింగ్ చౌహాన్.. ప్రభుత్వ ఖజానాకు గండికొట్టాలని చూసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని తేల్చి చెప్పారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది