Chiranjeevi : ముఖ్యమంత్రి కాబోతున్న చిరంజీవి.. 2024లో బీజేపీ, జనసేన కూటమి గెలిస్తే మెగాస్టారే సీఎం?
మెగాస్టార్ చిరంజీవి అనగానే గుర్తొచ్చేది ప్రజారాజ్యం పార్టీ. తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి.. రాజకీయాలను వదిలించుకొని మరీ.. మళ్లీ సినిమాలు చేస్తున్నారు. ఒక పార్టీ పెట్టి.. ఆ పార్టీని వేరే పార్టీలో కలిపేసి.. రాజకీయాలకు దూరంగా ఉన్నాక.. మళ్లీ ఆయన రాజకీయాల్లోకి వస్తారు అని ఎవ్వరూ కల కూడా కనరు. అందులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్.
అయితే.. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత.. పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీ జనసేనను స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో యాక్టివ్ గానే ఉన్నారు. కానీ.. మధ్య మధ్యలో సినిమాలు చేస్తున్నారు. అటు సినిమాలు.. ఇటు రాజకీయాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ వెళ్తున్నారు పవన్ కళ్యాణ్.
అయితే.. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే.. పవన్ పార్టీ జనసేనకు చిరంజీవి మద్దతు గురించి. చిరంజీవి.. మొదట్నుంచి.. జనసేన పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. పార్టీ విషయాల్లో జోక్యం కూడా చేసుకోలేదు. దీంతో పవన్ కళ్యాణ్.. ఒంటరిగానే పోరాడాల్సి వస్తుందని.. జనసేనకు మెగాస్టార్ మద్దతు ఉండదు కాబోలు అని అంతా అనుకున్నారు.
కానీ.. తాజాగా జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశమయ్యాయి. ఒక్కసారిగా రాజకీయాలు అక్కడ మారిపోయాయి. దానికి కారణం.. జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా.. మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఇస్తారు.. అని నాదెండ్ల ప్రకటించడమే.
పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంలో నేనూ ఉంటా.. చిరంజీవి
పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంలో నేను కూడా ఉంటాను.. అని చిరంజీవి తనతో చెప్పారని నాదెండ్ల మనోహర్ .. మీడియా ముందు చెప్పారు. అంటే.. 2024 ఎన్నికల నాటికి.. జనసేన, బీజేపీ కూటమికి మద్దతుగా చిరంజీవి ఉండటంతో పాటు.. రాజకీయాల్లో అప్పటి వరకు యాక్టివ్ అవుతారు.. అని అర్థం అవుతోంది. అందులోనూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమి గెలిస్తే.. నో డౌట్.. ఏపీ ముఖ్యమంత్రిగా చిరంజీవే అవుతారు.. అంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
పవన్ కళ్యాణ్.. జనసేన అధినేత అయినప్పటికీ.. తన అన్నకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని.. అందుకే.. ఇప్పటి నుంచే రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు మెగాస్టార్ సిద్ధం అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. చూద్దాం మరి.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో?