Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వెళ్లేది చంద్రబాబు రోడ్ మ్యాప్ లో.. జనసైనికులకు అన్యాయం
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వెళ్ళేది తెలుగు దేశం పార్టీ వేసిన రోడ్డు మ్యాప్ లో అని.. బీజేపీతో కంటే తెలుగు దేశం పార్టీ తోనే ఆయన సాన్నిహిత్యంగా ఉంటున్నాడు అంటూ ఏపీ మంత్రి కురసాల కన్న బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన తాడేపల్లి గూడెం లోని తన క్యాంప్ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడ్ గవర్నెన్స్ లో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు.. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయంటూ ఆయన సంతృప్తి వ్యక్తం చేశాడు.
బిజెపి నాయకత్వం లో ముందుకు వెళ్దాం అంటూ ఇటీవల ప్రకటించిన ఆయన ఎక్కువగా తెలుగు దేశం పార్టీ అజెండాను మరియు తెలుగు దేశం పార్టీ రోడ్డు మ్యాప్ ని ఫాలో అవుతున్నాడు అంటూ అసహనం వ్యక్తం చేశాడు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునేందుకు ఆయన 2024 ఎన్నికల్లో వైకాపా ని ఓడించాలంటూ వ్యాఖ్యలు చేస్తున్నాడని.. అది ఆయన తరం కాదని, జరుగుతున్న అభివృద్ధి ప్రత్యక్ష సాక్ష్యంగా ప్రజల వద్దకు తాము వెళ్తామని.. ప్రజలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి విజయాన్ని కట్టబెడతారు అంటూ మంత్రి పేర్కొన్నారు.

minister kurasala kannababu comments on pawan kalyan
గత ఎన్నికల్లో మాదిరిగానే పవన్ కళ్యాణ్ పార్టీకి ఆయన మిత్రపక్ష పార్టీకి పరాభవం తప్పదని.. రాబోయే ఎన్నికల తర్వాత ఆ రెండు పార్టీలు ఆంధ్రప్రదేశ్లో కనిపించవు అంటూ వైకాపా నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇంకా మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ బీజేపీ తో సాన్నిహిత్యంగా ఉంది అని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ వద్ద కౌలు రైతులకు కిసాన్ యోజన నిధులను తీసుకు వచ్చే దమ్ము ధైర్యం ఉందా అని సవాల్ చేశారు. బిజెపి ప్రభుత్వం తో సన్నిహితంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ఏపీకి ఇప్పటి వరకు ఏం తీసుకు వచ్చారు. వారితో ఏం చేయించారని కూడా మంత్రి ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు అని ఎప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధికి ఆయన పాటుపడిందే లేదని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.