Minister Roja : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో వారాహి విజయ యాత్ర లో వైసీపీ పై సీరియస్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. సీఎం జగన్ పై యధావిధిగా పవన్ మండిపడటం జరిగింది. రుషి కొండపై అక్రమంగా కట్టడాలు కట్టినట్లు.. పర్యావరణాన్ని పాడు చేస్తున్నట్లు మండిపడ్డారు. ఈ క్రమంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి రోజా తనదైన శైలిలో కౌంటర్లు ఇవ్వడం జరిగింది. వెనకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలని జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన రాజధానిగా విశాఖపట్నం ప్రకటించిన నాటి నుండి పవన్, చంద్రబాబు విశాఖ ప్రజలపై కక్ష కట్టినట్టు..
విశాఖ బ్రాండ్ ఇమేజ్ పాడు చేస్తూ.. విశాఖ క్రైమ్ సిటీగా ప్రాజెక్ట్ చేయాలనుకోవడం చాలా బాధాకరం. లక్ష పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ తాజాగా విశాఖలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే పదవ తరగతి అయినా పాస్ అయ్యాడా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే నిబంధనలు మరియు రూల్స్ అన్నిటికీ లోబడి పని చేస్తుంటే… పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకొని ఇష్టానుసారంగా విశాఖలో చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నాడని మంత్రి రోజా ఆరోపణలు చేయడం జరిగింది. రుషికొండ నిర్మాణానికి కేంద్ర అటవీశాఖ అనుమతులు ఇవ్వటం జరిగింది.
రెండు పర్మిషన్స్ కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చాయి. ఆ తర్వాతే రాష్ట్రానికి సంబంధించిన స్థానిక శాఖలు మిగతా అనుమతులు ఇవ్వటం జరిగింది. పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు తల్లకిందులు తపస్సు చేసిన..2024లో జనసేన, టీడీపీకు డిపాజిట్స్ కూడా రావు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ బాగుండాలని సంక్షేమం అందించడం మాత్రమే కాకుండా…. రాష్ట్ర అభివృద్ధి చెందాలని.. మూడు ప్రాంతాలలో మూడు రాజధానులు ప్రకటించి.. వాటి అభివృద్ధి దిశగా ఎలా ముందుకు వెళ్తున్నారు అన్ని ప్రాంతాల ప్రజలు గమనిస్తున్నారు. ఇంత పవన్ అరిచి అరుపులకు కేకలకు ప్రజలేవారు పట్టించుకోరని మంత్రి రోజా కౌంటర్లు వేయడం జరిగింది.
Jasprit Bumrah : ఇంగ్లండ్తో England జరుగుతున్న టెస్టు సిరీస్లో India Test Match ఇండియా అభిమానులకు సంతోషకరమైన వార్త.…
Husband Wife : ఒకప్పుడు భర్త చేతిలో భార్య హతం అనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఇప్పుడు కాలం…
Bolisetty Srinivas : ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితి రోజురోజుకూ మరింత అపహాస్య స్థాయికి చేరుతోంది. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం…
Roja : మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా మరోసారి తన దూకుడు ప్రదర్శించారు. నగరిలో జరిగిన "రీకాలింగ్…
Butchaiah Chaudhary : తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి పార్టీలో అహర్నిశలు శ్రమిస్తున్న నేతల్లో ప్రముఖుడు గోరంట్ల బుచ్చయ్య…
Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు జూలై 24న…
Earphones : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇయర్ ఫోన్స్ వాడకానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చెప్తున్నారు. బస్సులో ప్రయాణం…
Almond Oil Benefits : స్త్రీలైనా, పురుషులైన అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అందమైన ముఖము ఉంటే వారి జీవితం…
This website uses cookies.