minister vidadala rajini comments on pawan kalyan
Pawan Kalyan : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు చాలా విచిత్రంగా మారాయి. కేవలం వైసీపీ పార్టీని ఢీకొట్టేందుకు మిగితా పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి. ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నాయి ప్రధాన పార్టీలు. అందులో భాగంగానే ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి. అధికార వైసీపీని ఢీకొట్టడం కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన విషయం తెలిసిందే. ఇద్దరి భేటీ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లోనే చర్చనీయాంశం అయింది. నిజానికి.. 2014 ఎన్నికల్లోనే చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇచ్చారు. కేవలం పవన్ సపోర్ట్ తోనే చంద్రబాబు గెలిచారు.
కానీ.. గెలిచిన తర్వాత చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ను పక్కన పెట్టేశారు. దీంతో పవన్ కు కూడా అసలు రాజకీయాలు ఎలా ఉంటాయో అర్థం అయింది. ఆ తర్వాత ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా సొంతంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లోనూ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు పవన్ కళ్యాణ్. కానీ.. ఆ తర్వాత బీజేపీతో పొత్తు అన్నారు. కానీ.. ఏనాడూ బీజేపీతో కలిసి నడవలేదు. ఇప్పుడు చూస్తే ఏకంగా చంద్రబాబుతో కలిసి తిరుగుతున్నారు. టీడీపీ, జనసేన పొత్తుపై వైసీపీ బహిరంగంగానే విమర్శలు చేస్తోంది. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయారంటూ ఆరోపణలు చేస్తోంది. ఎన్ని పార్టీలు కలిసినా.. ఎంత మంది కలిసి పోటీ చేసినా సింహం సింగిల్ గానే బరిలోకి దిగుతుంది
minister vidadala rajini comments on pawan kalyan
అంటూ జగన్ ను ఉద్దేశించి వైసీపీ నేతలు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. వీళ్ల భేటీపై వైసీపీ మంత్రి విడదల రజిని కూడా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఇద్దరూ ఒక్కటే కానీ మనుషులు మాత్రమే వేరు అంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కందుకూరులో, గుంటూరులో జరిగిన ఘటనలపై ఏమాత్రం స్పందించని పవన్ కళ్యాణ్.. చనిపోయిన వారి కుటుంబాలను కనీసం పరామర్శించని పవన్ కళ్యాణ్.. ఇప్పుడు చంద్రబాబును కలవడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబును గెలిపించడం కోసమే పవన్ కళ్యాణ్ తాపత్రయపడుతున్నాడని విడదల రజిని ఆరోపించారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా.. సీఎం జగన్ వెంట ప్రజలు ఉన్నారని ఆమె తేల్చి చెప్పారు.
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
This website uses cookies.