MLA KethiReddy : వాలంటీర్ల వ్యవస్థ విషయంలో చంద్రబాబుపై ఎమ్మెల్యే కేతిరెడ్డి సీరియస్ వ్యాఖ్యలు వీడియో వైరల్..!!
MLA KethiReddy : ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాలంటీర్ల వ్యవస్థ పై కీలక వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. లబ్ధిదారుల సమాచారాన్ని గోపికను ఎలా తీసుకుంటారు అని… అది తప్పు కదా అంటూ ప్రశ్నించడం జరిగింది. ఇదే సమయంలో కోర్టు కొన్ని రిమార్క్స్.. బెంచ్ లో పాస్ చేస్తున్నట్లు పేపర్లలో కథనాలు వచ్చాయి. ఈ విషయంపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్పందించారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏదైనా పని జరగాలంటే జన్మభూమి కమిటీలకు డబ్బులు ఇవ్వాలి వాళ్ళు సంతకం పెడితేనే పని అయ్యేది. అటువంటి కమిటీల వల్లే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చాలా నష్టపోయారు. ఆ తర్వాత తమ ప్రభుత్వం వచ్చాక ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్ నీ నియమించడం జరిగింది.
ఆ తర్వాత రెండు వేల ఇళ్లకు ఒక సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారు. వాలంటీర్లు తమ పరిధిలో అర్హత కలిగిన వారిని సచివాలయంతో కనెక్ట్ చేసి… వారికి ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నారు. అయితే వాలంటీర్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఫస్ట్ రెండు సంవత్సరాలు కోవిడ్ రావటం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఒకరిని మరొకరు పాలికరించుకోలేని టైములో ఈ వాలంటీర్ వారి బాగోగులు చూసుకోవడం జరిగింది. ఆ సమయంలో వాలంటీర్ లేని చోట చాలామంది ప్రజలు ఇబ్బందులు పడిన సందర్భాలు తన దృష్టికి కూడా వచ్చినట్లు ఎమ్మెల్యే కేతిరెడ్డి తెలిపారు. ఎక్కడ పక్షపాతం లేకుండా ప్రజలకు ప్రభుత్వాలు నుండి వచ్చే పథకాలు ఇంకా అనేక లాభాలను వీళ్ళు అందిస్తూ ఉన్నారు.
ప్రభుత్వం ఇచ్చే గైడ్ లైన్స్ ప్రకారం కేవలం ప్రజల సమాచారాన్ని సచివాలయం వ్యవస్థకు అందిస్తున్నారు. ఆ తర్వాత పథకాలు అందిస్తూ ఉన్నారు. ప్రజలకు ఎంతో మేలు చేసే ఈ వాలంటీర్ వ్యవస్థను… తీసేయడానికి తెలుగుదేశం పార్టీ దొడ్డిదారులు వెతుకుతోంది. పోనీ తెలుగుదేశం పార్టీ వస్తే ఈ వాలంటీర్ వ్యవస్థ తీసేస్తామని చెప్పే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. ఇలా దొంగగా పిల్ వేసుకుంటూ అడ్డుపడటం సమంజసం కాదని ఎమ్మెల్యే కేతిరెడ్డి హెచ్చరించారు. ఈ క్రమంలో వాలంటీర్ల వ్యవస్థపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేయడం పట్ల ఖండించారు. ఈ క్రమంలో ప్రజలు గత టీడీపీ ప్రభుత్వంలో ఉన్న జన్మభూమి కమిటీల ద్వారా మేలు జరిగిందో లేకపోతే వాలంటీర్లు వ్యవస్థ వచ్చాక మేలు జరిగిందో వేర్ ఇస్ వేసుకోవాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి సూచించారు.