MLA Kethireddy : చదువు మానేయాలని బెదిరించిన బావ.. తెలుసుకున్న కేతిరెడ్డి ఉగ్రరూపం.. వీడియో వైరల్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :19 April 2023,9:00 pm

MLA Kethireddy : ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి నియోజకవర్గ సమస్యల విషయంలో స్పందించే తీరు చాలా విభిన్నంగా ఉంటుంది. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నా… కేతిరెడ్డి వ్యవహారం అందరికీ భిన్నంగా ఉంటుంది. “గుడ్ మార్నింగ్ ధర్మవరం” కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో పర్యటించి.. ఇంటింటికి తిరుగుతూ… సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఈ క్రమంలో పెన్షన్ రాకపోయినా ఇంకా..

రోడ్లు మౌలిక సదుపాయాలు వంటి విషయాలలో అక్కడికక్కడే పరిష్కారాలు చూపుతారు. చిన్నపిల్లలు చదువుకోకపోతే వెంటనే పాఠశాలలకు పంపుతారు. కాలేజీ స్టూడెంట్స్.. చదువు ఆపేస్తే కారణం తెలుసుకొని పరిష్కరిస్తారు. ఈ రకంగానే ఆడపిల్లలు కలిగిన ఓ నేతన్న కుటుంబం.. గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో ఎమ్మెల్యే కంటపడటం జరిగింది. ఈ క్రమంలో తండ్రి అనారోగ్యానికి గురై పెన్షన్ పోవడంతో వెంటనే సమస్యను పరిష్కరించారు.

MLA Kethireddy Interaction With College Drop Out Student

MLA Kethireddy Interaction With College Drop Out Student

అదే సమయంలో సదరు వృద్ధుడికి ఇద్దరు ఆడపిల్లలు ఉండటంతో.. పెద్ద ఆడపిల్ల భర్త… రెండో ఆడపిల్ల చదువు మాన్పించి ఇంటి దగ్గరే ఉంచాలని భయభ్రాంతులకు గురిచేసి చదువు మాన్పించడం ఎమ్మెల్యే దృష్టికి రావడం జరిగింది. సదర ఆడపిల్ల కన్నీరు పెట్టుకుని ఈ విషయాన్ని ఎమ్మెల్యే కి చెప్పుకోవటంతో… వెంటనే పోలీస్ కేసు పెట్టి సదరు ఆడపిల్లని డిగ్రీ చదవటానికి.. అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

sekhar

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి