Chandrababu – Jagan : ఈరోజే హైవోల్టేజ్ ఎలక్షన్.. చంద్రబాబు – జగన్ లకి సెమీ ఫైనల్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu – Jagan : ఈరోజే హైవోల్టేజ్ ఎలక్షన్.. చంద్రబాబు – జగన్ లకి సెమీ ఫైనల్ !

 Authored By kranthi | The Telugu News | Updated on :23 March 2023,4:00 pm

Chandrababu – Jagan : ఏపీలో రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. మామూలుగా కాదు. చాలా హీటెక్కుతున్నాయి. రాజకీయం బాగా ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసి ఫలితాలు కూడా ఇటీవలే వెలువడ్డాయి. వాటి తర్వాత తాజాగా ఎమ్మెల్యే కోటా ఎన్నికలు జరుగుతున్నాయి. నిజానికి.. ఈ ఎన్నికలు వైసీపీ, టీడీపీకి ప్రతిష్ఠాత్మకం అయ్యాయి. ఎందుకంటే ఇవి వచ్చే ఎన్నికలకు ప్రీ ఫైనల్ లా మారాయి. ఈ ఎన్నికల్లో ఏడు స్థానాలు ఉండగా..

ఎనిమిది మంది బరిలో ఉన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ఏపీ అసెంబ్లీలో పోలింగ్ జరిగింది.7 స్థానాల కోసం జరుగుతున్న ఈ పోటీలో 8 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అందులో ఏడుగురు వైసీపీకి చెందిన వారు కాగా.. ఒక్కరు మాత్రం టీడీపీ అభ్యర్థి. ఏడుగురు అభ్యర్థులు గెలవాలంటే ఒక్కో అభ్యర్థికి కనీసం 22 ఓట్లు రావాలి. వైసీపీకి ప్రస్తుతం ఉన్న బలం 154. ఏడుగురు అభ్యర్థులకు కావాల్సిన మెజారిటీ ఉంది. అలాగే.. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కానీ.. అందులో నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు వైసీపీ వైపు ఉన్నారు.

mla quota mlc elections to be conducted today

mla quota mlc elections to be conducted today

Chandrababu – Jagan : టీడీపీకి ఉన్న బలం 19 మాత్రమే

నలుగురు ఎమ్మెల్యేలు అటువైపు వెళ్లడంతో ప్రస్తుతం టీడీపీకి ఉన్న బలం 19 మాత్రమే. అయితే.. ఆనం, కోటంరెడ్డి ఈ ఇద్దరూ వైసీపీని వ్యతిరేకిస్తున్నారు. అంటే వీళ్లు టీడీపీ వైపు చూస్తున్నారు. దీంతో టీడీపీకి 21 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. కానీ.. ఒక్క అభ్యర్థి గెలవాలంటే కావాల్సిన మద్దతు 22 మంది ఎమ్మెల్యేలది. అంటే ఒక్క ఎమ్మెల్యే మద్దతు టీడీపీకి తక్కువవుతోంది. ఆ ఒక్క ఓటు కోసం టీడీపీ చేయని ప్రయత్నాలు లేవు. దాదాపు అందరు వైసీపీ ఎమ్మెల్యేలతో టీడీపీ టచ్ లోకి వెళ్లింది కానీ.. ఎవరైనా చంద్రబాబు వైపు మొగ్గుతారా? లేదా? అనేది తెలియాలంటే ఇంకొంత సేపు వెయిట్ చేయాల్సిందే.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది