UPI Offline : మొబైల్‌లో ఇంటర్నెట్ లేకపోయినా డబ్బులు పంపిచుకోవచ్చు.. ఎలాగో తెలుసుకోండిలా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

UPI Offline : మొబైల్‌లో ఇంటర్నెట్ లేకపోయినా డబ్బులు పంపిచుకోవచ్చు.. ఎలాగో తెలుసుకోండిలా..?

 Authored By mallesh | The Telugu News | Updated on :9 January 2022,1:00 pm

UPI Offline : టెక్నాలజీ రోజురోజుకూ అప్‌డేట్ అవుతున్న కొద్దీ వినియోగదారులకు సర్వీసులు కూడా సులువుగా అందుతున్నాయి. ఒకప్పుడు డబ్బులు తీసుకోవాలన్నా, ఇతరులకు పంపించాలన్నా బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది.. ఇప్పుడంతా ఆన్‌లైన్ సిస్టమ్ వచ్చేసింది. డబ్బులు డిపాజిట్ , విత్ డ్రా, ట్రాన్స్ ఫర్ ఇవన్నీ బ్యాంకుకు వెళ్లకుండానే జరిగిపోతున్నాయి. యూపీఐ ఐడీ ద్వారా మొత్తం ఆన్ లైన్ లావాదేవీలు జరిగిపోతున్నాయి. దీనికి ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. కానీ ప్రస్తుతం ఇంటర్నెట్ లేకుండా కూడా డబ్బులు పంపించుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది.ఈ మధ్యకాలంలో ఏ పని కావాలన్నా స్మార్ట్ ఫోన్ మన చేతిలో ఉంటే చాలు. ఇంటర్నెట్ సాయంతో ప్రతీ పనిని నిమిషాల్లో పూర్తి చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆఫ్ లైన్ ద్వారా కూడా డబ్బులు పంపించుకునే సదుపాయాన్ని *99# కల్పిస్తోంది.

 USSD 2.0 ద్వారా ఈ సర్వీస్‌ను ఉపయోగించుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులతో పాటు నాన్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం *99# సర్వీస్‌ను 2012లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)ప్రారంభించింది. యూపీఐ లావాదేవీలకు కూడా ఇదే నెంబర్‌ను వాడుకోవచ్చు. ఇంటర్నెట్ లేకుండా డబ్బులు ఎలా పంపించుకోవాలో తెలియాలంటే ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వండి..మీ స్మార్ట్‌ఫోన్‌లో ముందుగా బీమ్ యూపీఐ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత వన్ టైమ్ రిజిస్ట్రేషన్ పూర్తి చేశాక.. మీ ఫోన్ డయల్ ప్యాడ్‌లో *99# టైప్ చేసి కాల్ చేయాలి. అప్పుడు మీ మొబైల్‌కు ఏడు ఆప్షన్స్ వస్తాయి. వాటిలో సెండ్ మనీ, రీసివ్ మనీ, చెక్ బ్యాలెన్స, మై ప్రొ ఫైల్, పెండింగ్ రిక్వెస్ట్స్, ట్రాన్‌సాక్షన్స్, యూపీఐ పిన్ కనిపిస్తాయి. డబ్బులు పంపాలనుకుంటే డయల్ ప్యాడ్‌లో 1 నొక్కి సెండ్ మనీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. మీ ఫోన్ నెంబర్, యూపీఐ ఐడీ, అకౌంట్ నెంబర్ నుంచి డబ్బులు పంపే ఆప్షన్ యాక్టివ్ అవుతుంది.

money can sent even if there is no internet on mobile

money can sent even if there is no internet on mobile

UPI offline : డయల్ *99# తో ఇంటర్నెట్ అవసరంలే..

 తర్వాత పేమెంట్స్ మెథడ్‌లో ఏదైనా ఒక ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఫోన్ నెంబర్ సెలెక్ట్ చేస్తే ఎవరికి డబ్బులు పంపాలో వారి మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. యూపీఐ ఐడీ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే అవతలివారి యూపీఐ ఐడీ ఎంటర్ చేయాలి. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే 11 అంకెల ఐఎఫ్ఎస్‌సీ కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీరు ఎంత మొత్తం పంపాలనుకుంటున్నారో టైప్ చేసి, మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. చివరగా సెండ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అకౌంట్ నుంచి వేరే వారి అకౌంట్‌లోకి డబ్బులు యాడ్ అవుతాయి. అనంతరం ట్రాన్సాక్షన్ స్టేటస్ వివరాలు అప్‌డేట్‌తో పాటు రిఫరెన్స్ నంబర్ కూడా వస్తుంది. గూగుల్ పే, ఫోన్ పే యూజర్స్ కూడా యూపీఐ యాప్స్ ద్వారా కూడా ఇదే విధంగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది