MP Mithunreddy : నీలో చిత్తూరు జిల్లా రక్తం ఉందా? చిత్తూరు బిడ్డవా? దమ్ముంటే రారా చూసుకుందాం.. నారా లోకేశ్ కు మిథున్ రెడ్డి సవాల్

Authored By Breaking News 2 | The Telugu News | Published on: March 13, 2023, 6:40 pm

MP Mithunreddy : వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.. టీడీపీ నేత నారా లోకేశ్ కు సవాల్ విసిరారు. నారా లోకేశ్ సవాల్ మేరకు.. తంబళ్లపల్లికి రా నేను రెడీ.. మనం చర్చించుకుందాం. నేను చర్చకు సిద్దం. నీతో పోటీకి కూడా సిద్ధం. నువ్వు చర్చకు మాత్రమే కాదు.. పోటీకి కూడా సిద్ధమై రావాలి. నువ్వు కుప్పం వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు వాడు వీడు అంటూ అందరినీ అంటున్నావు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతోందా? అంటూ నారా లోకేశ్ ను ఎంపీ మిథున్ రెడ్డి ఏకిపారేశారు. నీ చాలెంజ్ కు మేము సిద్ధం. నువ్వు రెడీగా.

MP Mithunreddy Challenge to nara lokesh

MP Mithunreddy Challenge to nara lokesh

నువ్వు చంద్రబాబు కొడుకువి. రాష్ట్రమంతా నిన్ను ముద్దుగా పప్పు అని పిలుచుకుంటుంది. నేను తంబళ్లపల్లిలో ఎప్పుడైనా చర్చకు సిద్ధం. పప్పు.. సుద్ద లోకేశ్.. నువ్వు తంబళ్లపల్లి వస్తావా? తంబళ్లపల్లి ఊరిలో నేను రోజంతా ఉంటాను. ఎప్పుడైనా చర్చకు సిద్ధం. నేను ఒకటే ఒకటి చెబుతున్నాను. నీ పాదయాత్ర బ్రహ్మాండంగా అయింది అంటున్నారు కదా. నీలో చిత్తురు జిల్లా రక్తం ఉందా? నువ్వు చిత్తూరు బిడ్డవు అయితే.. జిల్లాలో ఏ సీటు అయినా ఎంచుకో. ఏదో ఒక సీటు ఎంచుకో. నేను రెడీ.. అంటూ చెప్పుకొచ్చారు మిథున్ రెడ్డి.

MP Mithun Reddy Challenge for Nara Lokesh to contest from Thambalapalle against him, fires on his comments

MP Mithunreddy : నువ్వు పోటీ చేయకపోతే నువ్వు మగాడివి కానట్టే

నువ్వు నిజంగా చెప్పేదంతా భయం లేదు.. అది చేస్తా.. ఇది చేస్తా అన్నావు కదా. నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు పోటీ చేయి అంతే. నువ్వు పోటీ చేస్తే నేను రెడీ. నీ చాలెంజ్ కు నేను సిద్ధం. నా చాలెంజ్ కు నువ్వు సిద్ధమా? చెప్పు. నీలో నిజంగా చిత్తూరు రక్తం ఉంటే నువ్వు చర్చకు రావాలి. ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ చేయాలి. లేదంటే నువ్వు మగాడివే కాదు. నీవన్నీ ఉత్తుత్తి మాటలే అని ఎంపీ మిథున్ రెడ్డి మీడియా ముందు నారా లోకేశ్ కు సవాల్ విసిరారు. మిథున్ రెడ్డి వ్యాఖ్యలపై నారా లోకేశ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp