01
Raghu Rama Krishnam Raju : ఏపీ రాజకీయాలు రోజురోజుకూ కొత్త మలుపు తీసుకుంటున్నాయి. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. ఏపీలో ఎన్నికలు వచ్చే సంవత్సరం ఏప్రిల్, మేలో జరుగుతాయి. ఈనేపథ్యంలో ఇప్పటి నుంచే ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఏపీ ఎన్నికలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో అక్కడ పాగా వేయాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తెగ ఆరాటపడుతోంది. అందులో భాగంగానే.. బీజేపీ కొత్త సమీకరణలను తీసుకొస్తోంది. ఏపీలో అధికార పార్టీని దెబ్బకొట్టాలంటే ఆ పార్టీ నేతలను తమ పార్టీలోకి లాక్కోవాలి.
దాని కోసం.. బీజేపీ రకరకాల ప్లాన్స్ వేస్తోంది. ఏపీతో పాటు తెలంగాణ రాజకీయాల మీద కూడా బీజేపీ ఫోకస్ పెట్టింది. అందుకే ఏపీ బీజేపీలో పలు మార్పులు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజును కూడా మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామను బీజేపీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.
వైసీపీలో రెబల్ గా మారిన రఘురామ చాలా రోజుల నుంచి బీజేపీకి మద్దతుగానే మాట్లాడుతున్నారు. ఢిల్లీలో బీజేపీకి మద్దతు ఇస్తూ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఈనేపథ్యంలోనే బీజేపీలోకి రఘురామకృష్ణంరాజు చేరుతున్నట్టు తెలుస్తోంది. అయితే.. రఘురామకు ఏ పొజిషన్ ఇస్తారు అనేదానిపై క్లారిటీ లేదు. ఒకవేళ బీజేపీకి ఏపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజును తప్పించి ఆ పదవి.. రఘురామకు ఇస్తారా అనేదానిపై కూడా క్లారిటీ లేదు. కానీ.. బీజేపీ ఏపీ అధ్యక్షులుగా ప్రస్తుతం రేసులో చాలామందే ఉన్నారు. అందులో దగ్గుబాటి పురంధేశ్వరి, సత్యకుమార్ యాదవ్ లాంటి వాళ్లు ఉన్నారు.
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.