Naga babu : వకీల్ సాబ్ మంత్రి వివాదం.. నాగబాబు వ్యాఖ్యలతో మరింత రచ్చ
Naga babu : పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా విడుదల సందర్బంగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక షో లకు అనుమతులు ఇవ్వక పోవడంతో పాటు టికెట్ల రేట్ల విషయంలో తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్న విషయం తెల్సిందే. ప్రముఖులు సైతం పవన్ కళ్యాన్ పై కోపంతోనే ప్రభుత్వం వారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అనే విమర్శలు చేయడం జరిగింది. మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు మరింత దుమారంను రేపిన విషయం తెల్సిందే. వకీల్ సాబ్ సినిమా పై ఆయన వ్యాఖ్యలను పవన్ ఫ్యాన్స్ చాలా సీరియస్ గా తీసుకుని సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ట్రెండ్ చేయడం జరిగింది.
Naga babu : నాగబాబు రియాక్షన్..
మంత్రి నాని వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు సీరియస్ గా స్పందించాడు. మంత్రి కరోనా వ్యాక్సిన్ తో పాటు రెబిస్ వ్యాక్సిన్ కూడా వేయించుకోవాలంటూ సూచించాడు. ఎవరైనా మంత్రికి ఆ వ్యాక్సిన్ ను విరాళంగా ఇవ్వాలంటే ఇవ్వొచ్చు అంటూ కాస్త ఘాటుగానే విమర్శలు చేశాడు. కుక్క కరిచిన వ్యక్తి మాట్లాడినట్లుగా నాని మాట్లాడాడు అనేది నాగబాబు అభిప్రాయం. పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికే నానిని సోషల్ మీడియాలో ఏకేసుకుంటునన ఈ సమయంలో నాగబాబు కూడా వారికి జత కలవడం తో మరింత రచ్చ జరుగుతోంది.

Naga babu comments on minister nani vakeel saab movie review
Naga babu : వివాదంకు ఫుల్ స్టాప్ ఏంటీ…
మంత్రి వ్యాఖ్యలపై పవన్ అభిమానులు మరియు నాగబాబు చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్న నేపథ్యంలో వివాదం ముదురుతోంది. పెద్ద ఎత్తున అభిమానులు బ్యాడ్ కామెంట్స్ చేస్తూ మంత్రిని విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయన చాలా సీరియస్ గా ఉన్నాడు. ఒక మంత్రిపై బ్యాడ్ కామెంట్స్ చేయడం ఎంతటి నేరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయినా కూడా పవన్ అభిమానులు చేస్తున్న వ్యాఖ్యలు రచ్చ రచ్చగా మారాయి. ఇలాంటి సమయంలో పవన్ సోదరుడి వ్యాఖ్యలు ఇష్యూను మరింతగా ముదిరేలా చేసిందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ వివాదంకు ఫుల్ స్టాప్ ఏంటో అనేది చూడాలి.