Nandamuri Balakrishna : ఇప్పుడిదే హాట్ టాపిక్.. బాలయ్య కొత్తింటి విలువ ఎంతంటే?

Authored By Cinema Desk | The Telugu News | Published on: February 27, 2021, 11:00 am

Nandamuri Balakrishna : సెలెబ్రిటీల వ్యక్తిగత విషయాలు, ఆస్థిపాస్థుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. అందుకే ఎప్పుడూ కూడా వారి పర్సనల్ లైఫ్ మీదే అందరూ దృష్టి పెడుతుంటారు. తాజాగా బాలయ్య బాబు కొత్త ఇంటిని కొన్నాడనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆల్రెడీ బాలయ్యకు బంజరాహిల్స్ రోడ్ నంబర్ 1లో విలాసవంతమైన భవనం ఉంది. కానీ ఇప్పుడు మరో ఇంటిని కొనుగోలు చేస్తుండటంతో హాట్ టాపిక్ అవుతోంది.

Nandamuri Balakrishna Bought New house 

Nandamuri Balakrishna Bought New house

Nandamuri Balakrishna : బాలయ్య కొత్తింటి విలువ ఎంతంటే?

నంద‌మూరి బాల‌కృష్ణ మరో కొత్త ఇంటిని కొనుగోలు చేసాడనే వార్తలు హల్చల్ అవుతున్నాయి. హైద‌రాబాద్‌లో ఉన్న జూబ్లీహిల్స్‌ సమీపంలో ఖ‌రీదైన ఇంటిని బాలయ్య భారీ రేటు పెట్టి కొనుగోలు చేసాడని టాక్. 9,935 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణం గల గ్రౌండ్ ఫ్లోర్‌, రెండు ఫ్లోర్‌ల‌తో కూడిన ఈ ఇంటిని రూ.15 కోట్లు పెట్టి కొనుగోలు చేశాడ‌ట బాలయ్య‌. ఇక రూ.82.5 ల‌క్ష‌లకు ఇంటి స్టాంప్ డ్యూటీ అలాగే రిజిస్ట్రేష‌న్ కు మరో రూ.7.5 ల‌క్ష‌లు బాలయ్య ఖర్చు చేసినట్టు వినికిడి.

ఇక ఈ విషయాలు కాసేపు పక్కన పెట్టేస్తే.. బాలయ్య ఇప్పుడు బోయపాటి సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. హ్యాట్రిక్ దిశగా ఈ ఇద్దరూ బాగానే ప్రయత్నిస్తున్నారు . ఇప్పటికి సింహా, లెజెండ్‌లతో బ్లాక్ బస్టర్‌లు కొట్టేశారు. బోయపాటి సినిమా పూర్తి కాగానే.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ బ్యానర్‌లో బాలయ్య ఓ సినిమా చేయనున్నాడు. ఈ విషయాన్ని ఈ మధ్యే మైత్రీ నిర్మాతలు అధికారికంగా ప్రకటించేశారు. మొత్తానికి బాలయ్య కూడా మంచి ఫాంలోనే ఉన్నాడు.

Cinema Desk

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp