Nara Brahmani : ఏంటి మావ‌య్య‌.. మీ కొడుకు అన్నీ త‌ప్పులే రాపిస్తున్నాడు.. నారా బ్రాహ్మణి మాటలకి చంద్రబాబు రియాక్షన్ చూడండి  

Authored By Breaking News 2 | The Telugu News | Published on: February 14, 2023, 11:00 am

Nara Brahmani : నారా లోకేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పప్పు, గిప్పు, తెలుగు కూడా సరిగ్గా మాట్లాడటానికి రాదు అంటూ ప్రతిపక్ష నేతలు గగ్గోలు పెడతారు. ఇదివరకు అయితే నారా లోకేశ్ ఎక్కడ మాట్లాడినా ఆయన మాట్లాడిన దాంట్లో ఏదో ఒక తప్పును వెతికి మరీ ట్రోల్ చేసేవారు. ఈ మధ్య నారా లోకేశ్ అలాంటి తప్పులు దొర్లకుండా చూసుకుంటున్నారు. ఇటీవల నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. పాదయాత్రలోనూ జనాలు ఎవ్వరూ కనిపించడం లేదంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

nara brahmani punch to nara lokesh infront of chandrababu

nara brahmani punch to nara lokesh infront of chandrababu

ఈ నేపథ్యంలో నారా లోకేశ్ కి సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు మళ్లీ దొరికిపోయాడు లోకేశ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం.. లోకేశ్ భార్య బ్రాహ్మణినే నారా లోకేశ్ తప్పును పట్టేయడం. ఇటీవల నారా లోకేశ్ కొడుకు దేవాన్షన్ కు చంద్రబాబు అక్షరాభ్యాసం చేయించారు. ఆ సమయంలో లోకేశ్, బ్రాహ్మణి ఇద్దరూ కలిసి లోకేశ్ కు అక్షరాభ్యాసం చేయించారు. బియ్యం మీద అమ్మ, అమరావతి, ఆరోగ్యం లాంటి పేర్లను దేవాన్ష్ తో రాయించారు. అమ్మ అనే పేరును లోకేశ్ తన కొడుకుతో బాగానే రాయించాడు.

nara brahmani punch to nara lokesh infront of chandrababu

nara brahmani punch to nara lokesh infront of chandrababu

Nara Brahmani : తన కొడుకు దేవాన్ష్ అక్షరాభ్యాసం వేడుకల్లో ఘటన

ఆ తర్వాత ఆంధ్రా అనే పేరును రాయించాడు. అయితే.. ఆంధ్రా పేరు రాయించేటప్పుడు ఆ రాయించిన తర్వాత ధ్రా రాయించకుండా రా రాయించి ఆ తర్వాత ధ్రా పేరు రాయించడంతో.. మామయ్య ఆంధ్రా పేరు రాయించమంటే.. ఆరాధ్రా అని రాయించాడు అంటూ చంద్రబాబుకు చెప్పింది బ్రాహ్మణి. దీంతో చంద్రబాబుకు ఏం చేయాలో తెలియలేదు. ముసిముసి నవ్వులు నవ్వి ఏం మాట్లాడుకుండా ఊరుకుండిపోయాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp