Nara Lokesh : అదే పాయింట్‌లో మళ్లీ దొరికిపోయిన నారా లోకేష్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nara Lokesh : అదే పాయింట్‌లో మళ్లీ దొరికిపోయిన నారా లోకేష్..

Nara Lokesh : ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారాలోకేశ్ ఆత్రం గురించి అందరికీ తెలిసిందే. మనోడు తెలుగులో మాట్లాడేందుకు కూడా చాలా తడబడుతాడు.పుట్టింది తెలుగు రాష్ట్రంలో అయినా తెలుగు మాట్లాడేందుకు ఎందుకు ఇలా కంగారు పడుతాడో ఎవరికీ అర్థం కాదు. తనయుడే బలంగా ఉంటే బాబు ఎంతో కొంత బలం ఉండేది. ఈ ఏజ్‌లో కూడా బాబు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు చాలా కష్టపడుతున్నారు. పార్టీలో సరైన నాయకత్వం లేక తెలుగు తమ్ముళ్లు […]

 Authored By mallesh | The Telugu News | Updated on :22 August 2022,8:00 pm

Nara Lokesh : ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారాలోకేశ్ ఆత్రం గురించి అందరికీ తెలిసిందే. మనోడు తెలుగులో మాట్లాడేందుకు కూడా చాలా తడబడుతాడు.పుట్టింది తెలుగు రాష్ట్రంలో అయినా తెలుగు మాట్లాడేందుకు ఎందుకు ఇలా కంగారు పడుతాడో ఎవరికీ అర్థం కాదు. తనయుడే బలంగా ఉంటే బాబు ఎంతో కొంత బలం ఉండేది. ఈ ఏజ్‌లో కూడా బాబు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు చాలా కష్టపడుతున్నారు. పార్టీలో సరైన నాయకత్వం లేక తెలుగు తమ్ముళ్లు కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు.

Nara Lokesh : మళ్లీ కంగారుపెట్టిన లోకేశ్..

రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి తెలుగుదేశం అధినేత మళ్లీ ప్రణాళికలు రచిస్తున్నాడు. అందుకోసం పార్టీలో బలమైన లీడర్లను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. కేడర్‌ను యాక్టివ్ చేసేందుకు రాత్రింబవళ్లు చాలా కష్టపడుతున్నారు. ఈ మధ్యకాలంలో నారా లోకేశ్ కూడా చాలా యాక్టివ్‌గా ఉన్నారు. జనాల్లోకి వెళ్లితున్నారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం, మంత్రుల తప్పులను ఎత్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాకుళానికి హైదరాబాద్ నుంచి ఆదరాబాదరాగా వచ్చిన టీడీపీ యువ నేత నారా లోకేష్ ఈ అదివారానా శ్రీకాకుళం కొత్త రోడ్డులో పోలీసులతోనే మాటల యుద్ధానికి దిగాడు. పలాసాలో ఉద్రిక్తతలు జరుగుతాయని లోకేశ్ అక్కడకు వెళ్లి ధర్నాకు దిగారు. దీంతో ప్రభుత్వం ఉంటుందా.. లోకేశ్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు.

Nara Lokesh found again at the same point TDP

Nara Lokesh found again at the same point TDP

దీంతో లోకేశ్ వారిపై సీరియస్ అయ్యారు. నన్ను ముట్టుకోవద్దని వారికి వార్నింగ్ ఇచ్చారు. తాను ప్రజా ప్రతినిధిని బాధితులను పరామర్శించడానికి వెళ్లకూడదా అని కూడా లోకేష్ లా పాయింట్ తీశారు.అయితే, లోకేష్ ప్రజల నుంచి ఎక్కడ నెగ్గారు చెప్పండని వైసీపీ నేతలు అడుగుతున్నారు.ఆయన దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయి నేను ప్రజా ప్రతినిధి అనడం హాస్యాస్పదంగా ఉందని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు.ఇంతకీ లోకేష్ పలాసా వచ్చి పరామర్శించాలనుకున్నది ఎవరిని అంటే.. చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ పలాస 27వ వార్డు కౌన్సిలర్, టీడీపీ నేత సూర్యనారాయణరాజు ఇళ్లను కూలగొట్టేందుకు అధికారులు ప్రయత్నించగా టీడీపీ నేతలు అడ్డుకుని ఉద్రిక్తలు సృష్టించారు.దాంతో అక్కడ వివాదం రాజుకోవడంతో లోకేశ్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది