Natukodi Pulusu Recipe : పల్లెటూరి నాటుకోడి కూర ఈ మసాలాలతో.. అదిరిపోయే టేస్ట్..
Natukodi Pulusu Recipe : ప్రస్తుతం ప్రతిదాంట్లోనూ కల్తీల నేపథ్యంలో ఏది తినాలన్న భయభ్రాంతులకు గురవుతున్నారు అందరూ. మనం తినే ప్రతి ఆహారంలో ఎంతో కొంత కల్తి అనేది ఉంటూనే ఉంది. కల్తీ లేకుండా దొరికే ఆహారం అంటే పల్లెటూర్లో దొరికే నాటుకోడి, వాటి గుడ్లు అవి నేచురల్ గా పెరుగుతాయి. వాటిలో ఎటువంటి కల్తి ఉండదు కాబట్టి అందరూ ఎక్కువగా వాటిపై మక్కువ చూపుతున్నారు. అలాంటి పల్లెటూరి నాటుకోడి కూర ఈ మసాలాలతో తయారు చేసుకుని తిని చూడండి.. ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఆ నాటుకోడి కూర ఎలా తయారు చేయాలో చూద్దాం..
దీనికి కావాల్సిన పదార్థాలు: నాటుకోడి మాంసం, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కారం, ఉప్పు ,ధనియాలు, గసగసాలు, ఎండు కొబ్బరి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పల్లీలు, టమాటాలు, పసుపు మొదలైనవి. దీని తయారీ విధానం: ముందుగా ఒక కేజీ నాటుకోడి చికెన్ తీసుకొని దాంట్లోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా ఎండి కొబ్బరి మొక్కను తీసుకొని దాన్ని మంటపై కాల్చాలి. తర్వాత స్టౌ పై ఒక బాండీ పెట్టుకొని దానిలో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ పల్లీలు, అర స్పూన్ గసగసాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మిరియాలు, నాలుగు యాలకులు, రెండు లవంగాలు, ఒకటి దాల్చిన చెక్క, వేసి ఎర్రగా వేయించుకోని కొద్దిసేపు చల్లారిన తర్వాత దీనిని వాటర్ పోసి మెత్తని పేస్ట్ లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
తర్వాత స్టౌ పై మట్టి మూకుడు పెట్టుకొని దానిలో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి, నాలుగు పచ్చిమిర్చి, ఒక బిర్యానీ ఆకు, రెండు లవంగాలు, రెండు యాలకులు, ఒక దాల్చిన చెక్క, ఒకటీ అనాసపువ్వు కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కరివేపాకు, ఒక కప్పు ఉల్లిపాయలు, వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న నాటుకోడి మాంసాన్ని వేయాలి. కొద్దిసేపు దానిని ఉడకనివ్వాలి. తర్వాత దానిలో ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ను దానిలో వెయ్యాలి. తర్వాత రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు వేసి కొద్దిసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత దానిలో టమాట ప్యూరీ వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. తర్వాత దానిలో అర లీటరు నీరు వరకు పోసుకొని 20 నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం గరం మసాలా వేసి పది నిమిషాల తర్వాత కొత్తిమీర చల్లి దింపేసుకోవాలి అంతే పల్లెటూరి నాటుకోడి కూర మసాలాలతో అదిరిపోయే టేస్ట్..
