Ysrcp : ఇదెక్కడి విడ్డూరం.. మంత్రి గారు చికిత్స కోసం పక్క రాష్ట్రంకు పలాయనం..!
Ysrcp : ఏపీ మంత్రి కొడాలి నాని తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తన నియోజక వర్గంలో సొంతంగా నిర్వహిస్తున్న కాసినోలు మరియు కేకాట శిబిరాలకు సంబంధించి సంక్రాంతి సందర్బంగా భారీ ఎత్తున హడావుడి కనిపించింది. కోడి పందాలను తలదన్నేలా గోవా క్యాసినో సెంటర్ కు ఏమాత్రం తగ్గకుండా మంత్రి కొడాలి నాని సొంత నియోజక వర్గం… అది కాకుండా సొంత క్యాసినో సెంటర్ ల్లో హడావుడి కనిపించింది. కరోనా కేసులు ఈ స్థాయిలో పెరుగుతున్న ఈ సమయంలో ఇదెక్కడి విడ్డూరం అంటూ కొందరు మంత్రి గారిపై విమర్శలు చేస్తున్నారు. తన నియోజక వర్గంను గోవా స్థాయిలో అభివృద్ది చేస్తున్నట్లుగా మంత్రి చేసిన ప్రకటన మరింతగా వివాదాస్పదంగా మారింది.
మంత్రి కొడాలి నాని ఇదే సమయంలో తనకు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయిన వెంటనే పక్క రాష్ట్రం తెలంగాణకు పలాయనం చిత్తగించడం పై కూడా జనాలు విమర్శలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్న ఈ సమయంలో తన క్యాసినో సెంటర్ లను వేలాది మందితో నిర్వహించడం పెద్ద తప్పు. ఆ వేడుక కారణంగా ఖచ్చితంగా వందల సంఖ్యలో జనాలు కోవిడ్ బారిన పడి ఉంటారు. తద్వారా కరోనా కేసులు మరింతగా పెరుగుతున్నాయని తెలుగు దేశం పార్టీ నాయకులు అంటున్నారు. మంత్రి గారు ఎందుకు కరోనా కేసుల విషయంలో లైట్ తీసుకుంటున్నారు.. ఆయనకు కరోనా అని నిర్థారణ అయిన వెంటనే పక్క రాష్ట్రంకు వెళ్లాడు అంటూ ప్రశ్నిస్తున్నారు.

netizens and tdp leaders trolls on ysrcp minister kodali nani
రాష్ట్రంలో క్యాషినో సెంటర్లు మరియు పేకాట క్లబ్ లకు కేంద్రంగా గుడివాడ మారిందంటూ విమర్శలు వస్తున్నాయి. జనాలను జూదానికి అలవాటు చేయడం ఏంటీ అంటూ విమర్శలు చేస్తున్నారు. మంత్రులు నిర్వహిస్తున్న పేకాట శివరాల విషయంలో మీడియా కూడా చూసి చూడనట్లుగానే వ్యవహరించడం దారుణం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కొడాలి నాని పై జనాల్లో అసంతృప్తి తీవ్ర స్థాయిలో వ్యక్తం అవుతోంది. ఆయన ఈ విమర్శలపై ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.