Nidigunta Aruna : అడ్డంగా బుక్కైన నెల్లూరు నెరజాణ..ఇక ఎవరెవరి జాతకాలు బయటకొస్తాయో ?
Nidigunta Aruna Arrest : ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన కేసులో నెల్లూరు జిల్లాకు చెందిన లేడీ డాన్ నిడిగుంట అరుణ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఆమె విజయవాడ వైపు కారులో వెళ్తుండగా అద్దంకి టోల్‌ప్లాజా వద్ద పట్టుకున్నారు. గత కొద్ది రోజులుగా అరుణ పేరు చీటింగ్ కేసులు, హనీట్రాప్ వివాదాల్లో వినిపిస్తుండగా, ఒక రాసలీల వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం మరింత పెద్దదైంది. అరుణపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు ఉండటమే కాకుండా, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు కూడా ఉన్నాయి.
#image_title
అరుణ అరెస్టుతో మరోసారి ఆమె రాజకీయ, పోలీసు సంబంధాలు బయటపడ్డాయి. జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న రౌడీషీటర్ శ్రీకాంత్‌కు పెరోల్ ఇప్పించడంలో ఆమె కీలక పాత్ర పోషించిందని ఆరోపణలు ఉన్నాయి. జైలు సూపరింటెండెంట్, ఇద్దరు ఎస్పీలు వ్యతిరేకించినా, ఉన్నతస్థాయి ఒత్తిళ్లతో పెరోల్ సాధ్యమైందని సమాచారం. ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం పెరోల్‌ను రద్దు చేసింది. అంతేకాకుండా, అనేక రియల్ ఎస్టేట్, సెటిల్మెంట్ కేసుల్లో కూడా ఆమె ప్రమేయం ఉందని ఆరోపణలు వస్తున్నాయి.
ప్రస్తుతం అరుణపై కోవూరు పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. పడుగుపాడులోని ఓ అపార్ట్‌మెంట్ ఫ్లాట్ కొనుగోలు విషయంలో యజమానిని లక్ష రూపాయల మేర మోసం చేశారనే ఆరోపణలపై ఆమెను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం ఆమెను కోవూరు పోలీస్ స్టేషన్‌కు తరలించి, బుధవారం మధ్యాహ్నం కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసుపై రాష్ట్ర హోం మంత్రి అనిత కూడా తీవ్రంగా స్పందించి, అరుణ వెనుక ఉన్న వారినీ బయటపెడతామని హెచ్చరించారు. దీంతో ఈ కేసు మరిన్ని రాజకీయ సంచలనాలకు దారితీయొచ్చని భావిస్తున్నారు.