NTR | ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ సోలో మూవీ.. ఇలా కన్‌ఫాం అయింది..!
NTR | ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన బాలీవుడ్ సినిమా వార్ 2 నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. అయితే బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ తమ YRF స్పై సినిమాటిక్ యూనివర్స్ లో అందరి హీరోలతో సోలోగా, మల్టీస్టారర్ గా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సోలో గా చేసిన హీరోలు వేరే సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ లు ఇస్తారు.
క్లారిఈట రావాలి..
#image_title
అయితే ఎన్టీఆర్ వార్ 2 లో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ పంచుకున్నాడు. గతంలోనే ఎన్టీఆర్ సోలోగా ఈ స్పై యూనివర్స్ లో సినిమా ఉంటుందని రూమర్స్ వచ్చాయి. నేడు వార్ 2 సినిమా క్లైమాక్స్ లో దేశం కోసం ఒక టైగర్, ఒక పఠాన్, ఒక కబీర్ వచ్చినట్టే రేపు ఒక రాఘవ కూడా రావొచ్చు అనే డైలాగ్ ఉంటుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రాఘవ, ఏజెంట్ విక్రమ్ అనే పేర్లతో కనిపిస్తాడు.
దీంతో ఎన్టీఆర్ సోలోగా స్పై సినిమా కచ్చితంగా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఎన్టీఆర్ సోలోగా స్పై యూనివర్స్ లో సినిమా ఉంటే ఆ సినిమాకు విక్రమ్ లేదా రాఘవ అనే టైటిల్ పెడతారేమో అని అనుకుంటున్నారు. వార్ 2తో ఎన్టీఆర్ బాలీవుడ్‌లో తన మార్క్ వేసేశాడు. భారీ యాక్షన్, స్టైలిష్ లుక్‌తో పాన్-ఇండియా ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. ఇక YRF యూనివర్స్‌లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంటున్న ఈ స్టార్ హీరోకు త్వరలోనే సోలో స్పై మూవీ ప్రకటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.