Ntv No.1 Channel : రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ న్యూస్ ఛానల్ గా ఎన్టీవీ సంచలన రికార్డ్..!!
Ntv No.1 Channel ; రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ న్యూస్ ఛానల్ గా ఎన్టీవీ సత్తా చాటింది. లేటెస్ట్ వార్తలతో ఎప్పటికప్పుడు సరికొత్త సమాచారాలతో 24*7 వార్తా ప్రసారాలతో మరోసారి దూసుకుపోయింది. ఉకదంపుడు ఉపన్యాసాలకు.. విరుగుడుగా లేటెస్ట్ కంటెంట్ వార్తలతో… ఛానల్ మొదలుపెట్టిన నాటి నుండి ప్రేక్షకుల ఆదరణ పొందుతూ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలో గ్రామం నుంచి పట్టణం వరకు ఇంకా జాతీయస్థాయిలో అన్ని రకాల వార్తలతో లేటెస్ట్ అప్ డేట్ లతో ప్రజాదరణ పొందింది.
ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ లతో పాటు కచ్చితంగా సర్వేల సమాచారంతో ప్రజలలో మంచి ఆదరణ ఎన్టీవీ సంపాదించుకుంది. వార్తలంటే తప్పుడు ప్రచారాలు… అనవసరమైన సంచలనాలు కాకుండా ఖచ్చితమైన సమాచారంతో.. ప్రజలను అప్రమత్తం చేయటంతో ఎన్టీవీ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. తాజాగా వెల్లడైన బార్క్ రేటింగ్స్ ప్రకారం ఎన్టీవీ 66.5 టీఆర్పీలతో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఎవరి పక్షాన నిలబడకుండా ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడుతూ అన్యాయాన్ని నిలదీస్తూ ప్రజలను అప్రమత్తం చేయటంతో
ఈ స్థానం సంపాదించుకుంది. ఎన్టీవీ ప్రతిక్షణం ప్రజాహితం అనే స్లోగాన్ కి తగిన న్యాయం చేయటం జరిగింది. దీంతో ఎన్టీవీ సిబ్బంది ఫుల్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన సర్వేలు తర్వాత ఫలితాలు వచ్చిన టైంలో ఎన్టీవీ విశ్లేషణ చాలా నమ్మకత్వానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఈ క్రమంలో ఎన్టీవీ బార్క్ రేటింగ్స్ ప్రకారం మొదటి స్థానంలో నిలవడం సంచలనంగా మారింది.