Sri Malika : ఆధ్యాత్మిక వర్గాల్లో ఆసక్తిదాయకమైన పురాణపండ ‘ శ్రీమాలిక ‘ పవిత్ర పరిమళాన్ని అందించిన నూజివీడు సీడ్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sri Malika : ఆధ్యాత్మిక వర్గాల్లో ఆసక్తిదాయకమైన పురాణపండ ‘ శ్రీమాలిక ‘ పవిత్ర పరిమళాన్ని అందించిన నూజివీడు సీడ్స్

 Authored By ramu | The Telugu News | Updated on :22 January 2026,6:27 pm

Sri Malika : పురాణాలు, ఆగమాల్లోని కొన్ని ముఖ్యాంశాలతోపాటు ఉపయుక్తమైన ప్రామాణిక ఉదాత్త భావనలతో , ఉపాసనాంశాలతో , మహిమాన్విత స్తోత్రాలతో ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అద్భుత రచనా సంకలన సంవిధానంగా నాలుగు వందల పేజీలతో రూపుదిద్దుకున్న ‘ శ్రీమాలిక ‘ మంత్ర మహాగ్రంధం తెలుగు రాష్ట్రాలలో వందల కొలది ఆలయాల్లో , పీఠాల్లో , మఠాల్లో , ధార్మిక పరిషత్ లలో చేస్తున్న పవిత్ర సందడి అంతా ఇంతా కాదు. కంచి కామకోటి పీఠం పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి అమృత హస్తాలతో గత సంవత్సరం ఘనంగా ఆవిష్కరణ జరుపుకున్న ‘ శ్రీమాలిక ‘ గ్రంధం ఇప్పటికి ఇరవై ఐదు పునర్ముద్రణలు జరుపుకోవడం సాహిత్య ఆధ్యాత్మిక వర్గాల్లో ఆసక్తిదాయకమైన చర్చనీయాంశమైంది.

Sri Malika ఆధ్యాత్మిక వర్గాల్లో ఆసక్తిదాయకమైన పురాణపండ' శ్రీమాలిక ' పవిత్ర పరిమళాన్ని అందించిన నూజివీడు సీడ్స్

Sri Malika : ఆధ్యాత్మిక వర్గాల్లో ఆసక్తిదాయకమైన పురాణపండ ‘ శ్రీమాలిక ‘ పవిత్ర పరిమళాన్ని అందించిన నూజివీడు సీడ్స్

ప్రఖ్యాత పారిశ్రామికవేత్త , జాతీయ పురస్కార గ్రహీత , నూజివీడు సీడ్స్ చైర్మన్ మండవ ప్రభాకర రావు తన తండ్రి – నూజివీడు సీడ్స్ ఫౌండర్ మండవ వెంకట్రామయ్య స్మృతిగా స్వగ్రామమైన నూజివీడులో జరిపిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ అపురూప శ్రీమాలిక గ్రంధాన్ని వందలాది ప్రతులు అందించడమే కాకుండా జంటనగరాలలో పలువురు ఫ్యాప్సీ సభ్యులకు, సినీ రాజకీయ ప్రముఖులకు సైతం వేల వేల ప్రతులు పంచడం పట్ల పలువురు అభినందనలు వర్షిస్తున్నారు. అప మృత్యువు , కాల మృత్యువు భయాల్ని తొలగించే మహా నృసింహావిర్భాఘట్టాన్ని ఈ శ్రీమాలికలో పురాణపండ శ్రీనివాస్ మహాసౌందర్య స్వరూపంగా ఆవిష్కరించారని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ఎమ్ . వెంకయ్యనాయుడు సైతం ప్రశంసలు వర్షించడం విశేషంగా చెప్పకతప్పదు.

Sri Malika ఆధ్యాత్మిక వర్గాల్లో ఆసక్తిదాయకమైన పురాణపండ' శ్రీమాలిక ' పవిత్ర పరిమళాన్ని అందించిన నూజివీడు సీడ్స్

Sri Malika : ఆధ్యాత్మిక వర్గాల్లో ఆసక్తిదాయకమైన పురాణపండ ‘ శ్రీమాలిక ‘ పవిత్ర పరిమళాన్ని అందించిన నూజివీడు సీడ్స్

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ల పాలనలో తెలుగునాట సంక్షేమం వెల్లివిరియాలని కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ , మాజీ మంత్రి బొల్లినేని కృష్ణయ్య సమర్పణలో ప్రచురించబడిన శ్రీమాలిక దివ్య గ్రంధాలు వేల కొలది ప్రతులు తిరుపతి, అమరావతి, నెల్లూరు , విజయవాడ , శ్రీశైలం , విశాఖపట్నం తదితర ప్రాతాలలో తెలుగుదేశం శ్రేణులకు, జనసేన శ్రేణులకు అందించడం ఒక విశేషమైతే కుప్పం , నారావారిపల్లె ప్రాంతాలలో వందలకొలది ముత్తయిదువులకు చంద్రబాబు సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి నూతన వస్త్రాలతో శ్రీమాలికను చేర్చి స్వయంగా పంచడాన్ని అక్కడి పెద్ద తరాలు ప్రశంసించడాన్ని ప్రత్యేకంగా పేర్కొనాలి. ఇటీవల చెన్నై లో జరిగిన వరల్డ్ తెలుగు ఫెడరేషన్ నిర్వహింహించిన తెలుగు మహోత్సవంలోను, విజయవాడ ఇంద్రకీలాద్రి సంక్రాంతి యజ్ఞ యాగాది క్రతువుల్లోనూ, యాదాద్రి లక్ష్మీ నారసింహుని సహస్ర కలశ అభిషేక ఉత్సవం లోను వందలకొలది భక్తులకు బొల్లినేని కృష్ణయ్య , శ్రీమతి సుజాత దంపతులు అందించిన శ్రీమాలిక బుక్ ఆకట్టుకుంది. ఇటువంటి మంగళగ్రంధం సమర్పించడం పూర్వ జన్మసుకృతంగా భావిస్తున్నట్లు నూజివీడు సీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ మండవ ఆశాప్రియ సంతోషం వ్యక్తం చేశారు. తన వియ్యంకుడు మండవ ప్రభాకరరావు , శ్రీమతి ఆషాప్రియ దంపతులు ఈ మంగళకార్యం చెయ్యడం పట్ల కిమ్స్ ఛైర్మన్ బొల్లినేని క్రిష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు.
మానవ జన్మలో ఎన్ని కోట్లు సంపాదించినా చివరికి ఇలాంటి అద్భుత పుణ్యకార్యాలు మాత్రమే మిగులుతాయని నూజివీడు సీడ్స్ ఉద్యోగ బృందం తమ యజమాని పట్ల కృతజ్ఞతాభావాన్ని ప్రకటించాయి.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది