OnePlus Mobile : త‌క్క‌వ బ‌డ్జెట్లో వ‌న్ ప్ల‌స్ నార్డ్ సీఈ2 లైట్ 5జీ ఫోన్.. స‌రికొత్త ఫీచ‌ర్స్ తో అందుబాటులో.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

OnePlus Mobile : త‌క్క‌వ బ‌డ్జెట్లో వ‌న్ ప్ల‌స్ నార్డ్ సీఈ2 లైట్ 5జీ ఫోన్.. స‌రికొత్త ఫీచ‌ర్స్ తో అందుబాటులో..

 Authored By mallesh | The Telugu News | Updated on :30 May 2022,5:30 pm

OnePlus Mobile : స్మార్ట్ ఫోన్ల బ్రాండ్ వ‌న్ ప్లస్ త‌క్కువ బ‌డ్జెట్ లో వ‌న్ ప్ల‌స్ నార్డ్ సీఈ2 లైట్ 5జీ ఫోన్ ను స‌రికొత్త ఫీచ‌ర్స్ తో తీసుకువ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.. రూ.20వేలలోపు ధర రేంజ్‌లో అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. 120 హెజ‌డ్ రీ ఫ్రెష్ రేట్‌తో కూడిన డిస్‌ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ల ఫాస్ట్ చార్జింగ్, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో ప‌ని చేస్తుంది. 64 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండగా.. నైట్‌స్కేప్, బొకే మోడ్ లాంటి విభిన్న మోడ్స్‌ ఉన్నాయి. 30 నిమిషాల్లోనే ఫోన్‌ 50 శాతం చార్జ్ అవుతుంది. అలాగే ఈ ఫోన్‌ 195 గ్రాముల బరువు ఉంటుంది.

6.59 ఇంచుల ఫుల్ ఎచ్డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేతో డిజైన్ చేయ‌బ‌డింది. మూడు బ్యాక్ కెమెరాల తో 64 మెగాపిక్సల్ ఫ్రంట్ కెెమెరా, 2 మెగాపిక్సెల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ షూటర్ ఫీచ‌ర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 471 ఫ్రంట్ కెమెరా క‌లిగి ఉంది. అలాగే 5G, 4G ఎల్టీఈ, వైఫై 6, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

oneplus nord ce2 lite 5g phone available with new features

oneplus nord ce2 lite 5g phone available with new features

6జీబీ ర్యామ్ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.19,999 కి ల‌భిస్తుంది. అలాగే 8జీబీ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999 కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. బ్లాక్ డస్క్, బ్లూ టైడ్ రెండు క‌ల‌ర్స్ ల‌లో అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ , వన్‌ప్లస్‌ అధికారిక వెబ్‌సైట్ తో పాటు రిలయన్స్ డిజిటల్, క్రోమా స్టోర్స్ లాంటి స్టోర్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది