Padma Shri : పాకిస్థాన్ సోల్జర్‌కు పద్మశ్రీ.. ఇండియాకు ఆయన చేసిన సాయమిదే..
Padma Shri : వివిధ రంగాల్లో అందించిన సేవలకుగాను పలువురికి పద్మ శ్రీ పురస్కారాలను భారత ప్రభుత్వం అందజేస్తుంది. ఈ అత్యున్నత పురస్కారం ప్రదానం చేసి వారిని గౌరవిస్తుంది. ఇటీవల పద్మశ్రీ పురస్కారాల ప్రదాన మహోత్సవం జరిగింది.భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మ శ్రీ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి అవార్డులను ప్రదానం చేశారు. ఈ సారి గతానికి భిన్నంగా పెద్ద సంఖ్యలో సామాన్యులకు పద్మ శ్రీ అవార్డులు లభించాయి.
కాగా, ఈ సారి పద్మశ్రీ అవార్డు అందుకున్న వారిలో పాక్ సైనికుడిగా పని చేసిన బంగ్లాదేశ్ వ్యక్తి కూడా ఉండటం గమనార్హం. ఆయన బంగ్ల విమోచన యుద్ధంలో పాల్గొన్నాడు. పాకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చిన ఆయన పేరు ఖాజీ సజ్జద్ అలా జహీర్. ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించడం చూసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ, ఆయనను గౌరవించడం వెనుక బిగ్ స్టోరినే ఉంది. ఆయన చేసిన సాయం వల్లనే బంగ్లా వార్‌లో పాకిస్థాన్ లొంగిపోయింది.
Padma Shri : ఖాజీ సజ్జద్ అలా జహీర్ అసమాన సేవలు..
నిజానికి ఖాజీ సజ్జద్ అలా జహీర్ పాకిస్థాన్ సోల్జర్‌గా ఎన్నో ఆశలతో జాయిన్ అయ్యాడు. పాకిస్థాన్ సైన్యం తరఫున పోరాటాలు చేయాలనుకున్నాడు కూడా. కానీ, పాకిస్థాన్ సోల్జర్స్‌లో కొందరు స్వదేశీయులపైన చేస్తున్నటువంటి అత్యాచారాలు, లూటీలు చూసి కలత చెందాడు ఖాజీ సజ్జద్ అలీ జహీర్. అక్కడ ఎదురైనటువంటి ఆ అనుభవాలను మదిలో దాచుకుని కలత చెంది బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో 70 వ దశకంలో చాలా కష్టపడి మరి బార్డర్స్ క్రాస్ చేసి ఇండియా చేరుకున్నాడు. ఆ సమయంలో పాక్ సైన్యం వివాలను తనతోనే తీసుకొని వచ్చి ఇండియాకు తెలిపాడు. అయితే, తొలుత ఆయన్ను భారత సైన్యం అనుమానించింది.
బహుశా పాక్ గూఢచారి అనేమో అనుకుంది. కానీ, ఆయన నిజాయితీ గుర్తించి ఆయన సేవలను వినియోగించుకుంది. యుద్ధం సమయంలో పాక్ ఎత్తుగడలు గమనించి నదిలో దూకి అక్కడి నుంచి సురక్షితంగా బీఎస్ఎఫ్ దళాల్లో చేరి అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చాడు. ప్రస్తుతం ఈయన బంగ్లాదేశ్‌లో స్థిరపడ్డాడు.