
#image_title
Passion fruit | ప్రకృతి మనకు అందించిన ఆహారాల్లో పుష్కలంగా పోషకాలు ఉండే వాటిలో పాషన్ ఫ్రూట్ (కృష్ణ పండు) ఒకటి. ఇది కేవలం రుచికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. తీగజాతికి చెందిన ఈ మొక్క పండ్లతోపాటు ఆకులలోనూ అరుదైన ఔషధ గుణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
#image_title
రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే పండు
పాషన్ ఫ్రూట్ లోపలి భాగం జ్యూసీగా, తేనెరసం లాంటి మెత్తని పదార్ధంతో నిండి ఉంటుంది. ఇది శక్తివంతమైన ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, బీటా కెరోటిన్, పొటాషియం, విటమిన్ సి లతో నిండి ఉంటుంది. ఇవన్నీ కలిసి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
పాషన్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు:
శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు: శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తొలగించి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
మధుమేహ నియంత్రణ: తరచూ తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
కంటి ఆరోగ్యం: ఇందులో ఉండే విటమిన్ A, బీటా కెరోటిన్ కంటికి సంబంధించిన రుగ్మతలు, అంధత్వాన్ని నివారిస్తాయి.
క్యాన్సర్ రక్షణ: కొన్ని అధ్యయనాల ప్రకారం, ఈ పండు తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వంటి సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు.
బరువు నియంత్రణ: అధిక ఫైబర్ కారణంగా, ఇది జీర్ణక్రియను మెరుగుపరచి బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.
ఆకులు కూడా అమూల్యమైనవే!
పాషన్ ఫ్రూట్ ఆకులు కూడా పండ్లంతే శక్తివంతమైన పోషకాలతో నిండి ఉంటాయి.
ఆకుల్లో విటమిన్ సి, ఫ్లావనాయిడ్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల అవి ఔషధంగా పనిచేస్తాయి.
ఆకుల కషాయం లేదా రసం తీసుకోవడం వల్ల బీపీ, బ్లడ్ షుగర్, నాడీ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
డయాబెటిస్ ఉన్నవారికి ఇవి చాలా మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.