Pawan- Bunny | పవన్ కళ్యాణ్ – అల్లు అర్జున్ ఫ్యాన్స్ వార్‌కు బ్రేక్ పడే సమయం వచ్చిందా?
Pawan- Bunny | ఇండియన్ సినిమా అభిమానుల మధ్య హీరోల గురించి వాదనలు, గొడవలు, ట్రోలింగ్‌లు కొత్త విషయం కాదు. కానీ మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ – అల్లు అర్జున్ మధ్య ఉన్న ఫ్యాన్ వార్ మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా ఒక ప్రత్యేక చర్చగా మారింది. అల్లు అర్జున్ ఒక ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ పేరును స్పెషల్‌గా ప్రస్తావించకుండా “నేను ఎవరి పేరు చెప్పను బ్రదర్” అన్న వ్యాఖ్యల తర్వాతే ఈ చర్చ మొదలైంది. దీనిపై పవన్ ఫ్యాన్స్ తీవ్రమైన ట్రోలింగ్ మొదలుపెట్టారు.

#image_title
ఇప్పుడైన మారండి
అదే సమయంలో, 2024 ఎన్నికల ముందు అల్లు అర్జున్ తన స్నేహితుడైన వైసీపీ నేతకు మద్దతు ఇవ్వడంతో జనసేన అభిమానులు మరింత కంగారు పడ్డారు. పవన్ కళ్యాణ్ ఉండగానే బన్నీ విపక్ష నేతకు సపోర్ట్ చేశాడనే అభిప్రాయం పుట్టింది. ఫలితంగా ఈ ఫ్యాన్ వార్ రోజురోజుకు పెరిగింది.ఇదంతా జరుగుతుండగా, పవన్ కళ్యాణ్ – అల్లు అర్జున్ మధ్యన వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని అనేక సందర్భాల్లో స్పష్టమైంది.
ఇటీవల అల్లు అర్జున్ నానమ్మ మరణించిన సందర్భంగా మెగా ఫ్యామిలీ మొత్తం – చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ సహా – ఆ కుటుంబానికి పరామర్శ తెలిపింది. ఈ సమయంలో పవన్, బన్నీ కలిసి మాట్లాడిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్ తనతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ, “పవర్ స్టార్ – డిప్యూటీ సీఎం” అంటూ స్పెషల్ విషెస్ చెప్పారు. అభిమానులకు ఇది ఓ మెసేజ్ లాంటిదే. పవన్ కోసం బన్నీ పోస్టు పెట్టారు, బన్నీ కోసం పవన్ వెళ్లారు. ఇంక ఫ్యాన్స్ ఎందుకు కొట్టుకోవడం.