Pawan Kalyan : ఆఖరి నిమిషం లో పవన్ కళ్యాణ్ కి గట్టి దెబ్బ కొట్టిన ఆలీ !
Pawan Kalyan : నటుడిగా, హోస్ట్‌గా సినీ ప్రేక్షకులని ఎంతగానో అలరించిన ఆలీ ఇప్పుడు రాజకీయాలలో కూడా రాణిద్దామని అనుకుంటున్నారు. సినిమాల్లో ఉన్నప్పటి నుండి పవన్ కళ్యాణ్‌కి చాలా సన్నిహితంగా ఉన్న ఆలీ ఊహించని విధంగా వైసీపీలోకి వెళ్లాడు. 2019 ఎన్నికల ముందు అనూహ్యంగా వైసీపీలో చేరి అందరినీ ఆశ్చర్య పరిచారు . అప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నా సీట్ల సర్దుబాటులో అది కుదరలేదు. దీంతో వైసీపీ తరఫున ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. పార్టీ ముఖ్యంగా ముస్లిం ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అలీ చేత ప్రచారం చేయించింది. ఆ తర్వాత అతనికి మంచి పదవి ఇస్తారు అని అందరు అనుకున్నారు. కాని అది నిరాశే అయింది.
Pawan Kalyan : ఏం జరుగుతుంది..
వైసీపీలో అలీ చేరిన తర్వాత ఆయనకు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గాయంటున్నారు. ఈ కారణంగా సినిమా ఇండస్ట్రీ కాస్త దూరం పెట్టిందని కూడా ప్రచారం జరుగుతోంది. పార్టీ మారేంత వరకూ సినిమా అవకాశాలు పుష్కలంగా ఉన్న అలీకి ఇప్పుడు పూర్తిగా అవకాశాలు రావడం లేదు. దీనికి కారణం వైసీపీలో చేరడమే అంటున్నారు అలీ సన్నిహితులు. అయితే తనతో పాటు వైసీపీకి ఒత్తాసు పలికిన మోహన్ బాబు, పోసాని కృష్ణమురళీలకు కూడా రిక్త హస్తమే చూపించారు. థర్టీ ఈయర్స్ పృధ్వీకి టీడీపీ చానల్ చైర్మన్ చేసినా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. ఆయనపై ఆరోపణలు రావడంతో పక్కన పడేశారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో అలీకి వక్ఫ్ బోర్డుచైర్మన్ ఇస్తారని జోరుగా ప్రచారం సాగింది. కానీ వైసీపీకి చెందిన సీనియర్ మైనార్టీ నాయకుడికి కట్టబెట్టారు. తరువాత రాజ్యసభ స్థానానికి అలీ పేరు పరిశీలిస్తున్నారని లీక్ చేశారు. అయితే దానిపై అఫీషియల్ ప్రకటన ఇంత వరకు రాలేదు. దీంతో విసుగు చెందిన ఆలీ జనసేనలోకి వెళ్లలని అనుకుంటున్నట్టు ప్రచారం జరిగింది. ఇది వైసీపీకి కలవరపాటుకు గురిచేసింది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి అలీ పేరుతో ఒకప్రెస్ నోట్ రిలీజ్ అయ్యింది. తాను జనసేనలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. మరి ఆలీ దీనిపైన ఏమన్నా స్పందిస్తాడా అన్నది చూడాలి.