Pawan Kalyan : చెప్పుతో కొడతా అన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యల మీద మొట్టమొదటిసారి స్పందించిన వైఎస్ జగన్
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. కొన్ని రోజుల పాటు రాజకీయాలకు విరామం ఇచ్చి పవన్.. కొన్ని రోజుల పాటు సినిమాల షూటింగ్ లో పాల్గొన్నారు. సినిమాల షూటింగ్ పూర్తయ్యాక.. మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. అయితే.. అధికార పార్టీ వైసీపీ నేతలపై ఆయన తాజాగా చేసిన విమర్శలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఇంతలా ఆవేశపడి మాట్లాడింది లేదు. ఇంతలా విమర్శించింది లేదు. తొలిసారి ఆయన అంతలా విమర్శించడం చూస్తుంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఇక పూర్తి స్థాయిలో యాక్టివ్ అయిపోయారని తెలుస్తోంది.
వైజాగ్ లో జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో విజయవాడకు చేరుకున్న తర్వాత మంగళగిరిలో జనసేన పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన పవన్ కళ్యాణ్ ఈసందర్భంగా వైసీపీ నేతలపై సీరియస్ అయ్యారు. తనను ప్యాకేజ్ స్టార్ అనడం, మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అంటూ వైసీపీ నేతలు ప్రతీసారి కౌంటర్ ఇస్తుండటంతో ఇక తప్పని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై రెచ్చిపోవాల్సి వచ్చింది. సన్నాసి నాకొడుకులను చెప్పు తీసుకొని కొడతా, దవడ పగిలేలా కొడతా అని పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

pawan kalyan counter ysrcp leaders in janasena party meeting
Pawan Kalyan : రైతు భరోసా కోసం రూ.3 కోట్లు ఖర్చుపెట్టిన జనసేన
అయితే.. ప్యాకేజ్ స్టార్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ తన ఆదాయం గురించి అందరి ముందు బయటపెట్టారు. తను ఎన్ని సినిమాల్లో నటించారో.. ఎంత డబ్బును సంపాదించారో.. రైతు భరోసా కోసం, సీఎం రిలీఫ్ ఫండ్ కోసం, ఇలా పలు సేవా కార్యక్రమాల కోసం పవన్ కళ్యాణ్ ఎంత ఖర్చు పెట్టారో అంతా వెల్లడించారు. పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై వైసీపీ నేతలు మాత్రం ఇంకా స్పందించలేదు. వైసీపీ నేతల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అలాగే.. ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. చూద్దాం మరి.. వైసీపీ నేతల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.