Pawan Kalyan | పవన్ కళ్యాణ్‌కి శుభాకాంక్షల వెల్లువ.. చిరు, మోదీ, బన్నీ స్పెషల్ విషెస్
Pawan Kalyan | నేడు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టినరోజు కావడంతో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు శుభాకాంల వర్షం కురిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు.తన తమ్ముడు పవన్‌తో కలిసి ఉన్న ఒక పాత ఫొటోను పంచుకున్న చిరంజీవి, హృదయపూర్వక సందేశాన్ని పోస్ట్ చేశారు.

#image_title
సెలబ్రిటీల విషెస్..
“సినిమా రంగంలో అగ్ర నటుడిగా, ప్రజా జీవితంలో జనసేన నాయకుడిగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా నిరంతరం ప్రజలకు సేవ చేస్తున్న కల్యాణ్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు” అని చిరంజీవి పేర్కొన్నారు. “ప్రజాసేవలో నువ్వు చూపిస్తున్న అంకితభావం మరువలేనిది. ప్రజలందరి ఆశీస్సులతో, ఆప్యాయతతో సంపూర్ణ ఆరోగ్యంతో నూరేళ్లు జీవించి, ప్రజలకు మార్గనిర్దేశకుడిగా నిలవాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను” అంటూ మెగాస్టార్ తన పోస్టులో రాసుకొచ్చారు.
అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పవన్ కల్యాణ్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. పవన్ తో కలిసి సంతోషంగా నవ్వులు చిందిస్తున్న ఒక ఫొటోను ఆయన షేర్ చేశారు. ఈ పోస్టుకు “మా పవర్‌స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అంటూ క్యాప్షన్ జోడించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు అగ్ర హీరోలు పెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు, దేశ ప్రధాని మోదీతో పాటు లోకేష్, ఇతర ప్రముఖులు కూడా పవన్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.