Pawan Kalyan : అస్వస్థతతో హాస్పిటల్ లో చేరిన పవన్ కళ్యాణ్.. ఆయనకు ఏమైంది?
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజుల నుంచి బయట కనిపించడం లేదు. వకీల్ సాబ్ సినిమా రిలీజ్ తర్వాత నుంచి ఆయన పెద్దగా బయటికి రావడం లేదు. చివరకు తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలోనూ ఆయన పాల్గొనలేదు. బీజేపీ తరుపున ఆయన తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొంటారని భావించినా.. ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవడం… ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొనకపోవడంతో… ఆయన అస్వస్థతకు గురయినట్టు తెలిసింది.
ఇటీవలే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బందికి కరోనా రావడంతో పవన్ కళ్యాణ్ కూడా హోం క్వారంటైన్ కు వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన హెల్త్ గురించి ఎటువంటి సమాచారం లభించలేదు. ఆయన తిరుపతి ఉపఎన్నిక ప్రచారానికి రాకపోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై పవన్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. హోం క్వారంటైన్ లో ఉన్న పవన్ కళ్యాణ్ కు ఊపిరితిత్తుల సమస్య వచ్చినట్టు తెలుస్తోంది. ఊపిరితిత్తులకు కొద్దిగా ఇన్ఫెక్షన్ రావడంతో ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు కరోనా సోకిందా?
అయితే… పవన్ కళ్యాణ్ కు కరోనా సోకిందేమోనన్న అనుమానంతో ఆసుపత్రిలో చేరిన తర్వాత వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అయితే.. ఊపిరితిత్తుల్లో పవన్ కు ఇన్ఫెక్షన్ అయినట్టు పోలీసులు వెల్లడించినట్టు తెలుస్తోంది. అయితే.. ఆయన ఏ ఆసుపత్రిలో చేరారు… ఆయన ఆరోగ్య సమాచారానికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం తెలియదు. పవన్ ఆరోగ్యంపై ఆయన కుటుంబం కూడా ఇప్పటి వరకు స్పందించలేదు.